Phalguna Amavasya 2026 Remedies in Telugu: హిందూ ధర్మంలో ఫాల్గుణ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే అమావాస్యను చాలా విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు మీ ఏడు తరాల పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, మీ కుటుంబంలో సుఖసంతోషాలను నింపుతాయి.
ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు?
పంచాంగం ప్రకారం, అమావాస్య ప్రారంభం: ఫిబ్రవరి 16, 2026 సాయంత్రం 05:34 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 17, 2026 ఉదయం 05:30 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి మరియు స్నాన-దానాలకు ఫిబ్రవరి 17, మంగళవారం అత్యంత శుభప్రదమైన రోజు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 05:35 నుండి 06:25 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 01:23 వరకు ఉంటుంది.
పితృదేవతలను ప్రసన్నం చేసుకునే పరిహారాలు
అమావాస్య రోజున గంగానది లేదా ఏదైనా పవిత్ర నది తీరాన పితృదేవతలకు తర్పణం వదలడం శ్రేష్టం. నీటిలో నల్ల నువ్వులు, కుశ (దర్భ), యవలు కలిపి పూర్వీకులను ఆహ్వానిస్తూ తర్పణం ఇవ్వాలి. దీనివల్ల పితృదేవతల ఆత్మ శాంతిస్తుంది. రావి చెట్టులో త్రిమూర్తులతో పాటు పితృదేవతలు కూడా నివసిస్తారని నమ్మకం. అమావాస్య రోజున రావి చెట్టు వేళ్లకు నీరు పోసి, సాయంత్రం సమయంలో ఆవ నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి. ఆహారం తీసుకునే ముందు ఆవుకు, కాకికి, చీమలకు కొంత ఆహారాన్ని తీసి పెట్టాలి.
Also Read: Vijaya Ekadashi 2026 -శత్రువులపై విజయం సాధించాలా? అయితే ఈ వ్రతం ఆచరించండి!
అమావాస్య నాడు ఆవుకు పచ్చి గడ్డి తినిపించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. పితృదోష శాంతి కోసం బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు తమ శక్తి కొద్దీ అన్నదానం, వస్త్రదానం లేదా నువ్వుల దానం చేయాలి. దీనివల్ల ఏడు తరాల పితృదేవతలు ప్రసన్నమై ఆశీర్వదిస్తారు. అమావాస్య సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటి పైకప్పు పైన దక్షిణ దిశ వైపు ముఖం ఉండేలా నెయ్యి దీపం వెలిగించాలి. దక్షిణ దిశ పితృదేవతల నివాస స్థానంగా భావిస్తారు.

