PM Modi Visits Maldives: జూలై 23 నుండి 26 వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉంటున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటనలో యూకే, మాల్ దీవులలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. గతేడాది మాల్ దీవుల మంత్రులు చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యల కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గతేడాది మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలకు బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట హాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ ఉద్రిక్తతల అనంతరం మొదటిసారి ప్రధాని మోదీ మాల్ దీవుల పర్యటనకు వెళ్లనున్నారు.
జూలై 23-24 తేదీలలో మొదట యూకేలో పర్యటించి జూలై 25-26 తేదీలలో మాల్దీవులలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని హాజరుకానున్నారు.
Readmore: https://teluguprabha.net/news/senate-opposes-death-penalty-for-harboring-hijackers/
ఈ పర్యటనతో మళ్లీ రెండు దేశాల నడుమ సఖ్యత ఏర్పడి పరస్పర ప్రయోజనాలతో బలమైన దౌత్య సంబంధాలు ఏర్పాటు అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/us-designates-trf-terrorist-group-pahalgam-attack/


