Tuesday, June 17, 2025
HomeNewsPrabhas: ‘రాజా సాబ్’కి షాకిచ్చిన బాలీవుడ్ మేకర్స్

Prabhas: ‘రాజా సాబ్’కి షాకిచ్చిన బాలీవుడ్ మేకర్స్

The Raja saab: గత ఏడాది కల్కి చిత్రంతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన ప్రభాస్ ఈ ఏడాది ‘ది రాజా సాబ్’తో సందడి చేయటానికి రెడీ అవుతున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. తొలిసారి ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ జోనర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతూ ‘ది రాజాసాబ్‌’ డిసెంబర్5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ హారర్ కామెడీ థ్రిల్లర్‌కు సంబంధించిన టీజర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది పండగే.

- Advertisement -

‘ది రాజా సాబ్’ టీజర్‌లో కళ్లు కట్టి పడేసే విజువల్స్, ప్రభాస్ స్టైల్‌కు తగ్గ కామెడీ పంచులు, మారుతి స్పెషల్ హారర్ కామెడీ బ్లెండ్ సూపర్‌గా వర్కౌట్ అయ్యాయి. యూట్యూబ్‌లో ఇది వేగంగా ట్రెండ్ అవుతూ ఉంది. ఇందులో బాలీవుడ్ లెజెండ్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓ భవంతిలో నివసించే ఆత్మగా, ప్రభాస్ తాతగా, తనదైన స్టైల్‌లో స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. ఇక హీరోయిన్ పరంగా చూస్తే ఈసారి డార్లింగ్ ఏకంగా ముగ్గురు కథానాయికలు.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లతో రొమాంటిక్ ట్రాక్‌ను ఫుల్ రోమాన్స్‌తో ప్లే చేయనున్నారు. గత చిత్రాల్లో కనిపించని, అభిమానులు మిస్ అయిన రొమాంటిక్ యాంగిల్‌ను ప్రభాస్‌లో చూపించటానికి మారుతి రెడీ అయిపోయారు. దీని కోసం నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ వంటి హీరోయిన్స్ ను ప్రభాస్ సరసన నటింప చేస్తున్న సంగతి తెలిసిందే.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/samyuktha-menon-in-puri-jagannadh-vijay-sethupathi-movie/

ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఒక ట్విస్ట్ కూడా ఉంది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం డైరెక్టర్ మారుతి ఓ భారీ ప్లాన్‌ వేసారు. బాలీవుడ్‌లో ఒక క్లాసిక్ సాంగ్‌ని రీమిక్స్ చేసి, ప్రభాస్‌తో పాటు మూడు హీరోయిన్‌లపై ఓ భారీ డాన్స్ నెంబర్ చేయాలనుకున్నారు. అయితే ఆ పాట హక్కుల కోసం సంప్రదించిన బాలీవుడ్ సంస్థ వారికి షాకిచ్చింది – పాట రైట్స్ కోసం ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేయడంతో రాజా సాబ్ చిత్రబృందం ఆశ్చర్యపోయింది. అంత మొత్తం పెట్టి రైట్స్ కొనే ఐడియాను డ్రాప్ చేసి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ చేత కొత్తగా ఓ ఎలివేటింగ్ మాస్ సాంగ్ కంపోజ్ చేయించారట. తమన్‌కి ఈ జోనర్‌లో అనుభవముండటంతో, అంచనాలకు తగ్గట్టే పాట వచ్చిందని సమాచారం. థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఫుల్ రిస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని, మెగా హిట్ అయ్యే ఛాన్సులున్నాయని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News