The Rajasaab Ott: ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ ప్రస్తుతం థియేటర్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ మీద మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ స్టామినాకు, రేంజ్‌కు తగ్గ మూవీ కాదని అంతా అభిప్రాయ పడుతున్నారు. మారుతి అయితే స్టార్ హీరో అయిన ప్రభాస్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని అంటున్నారు. మరి ఇంటి అడ్రసె ఇచ్చిన మారుతి పరిస్థితి ఏంటో అని ఇప్పుడు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే ప్రభాస్‌కి ఉన్న స్టార్డంతో ఈ మూడు రోజులు బాగానే ఆడేస్తుంది. మన శంకర వర ప్రసాద్ థియేటర్లోకి వచ్చే వరకు రాజా సాబ్ బాగానే ఆడేలా కనిపిస్తోంది.
రాజా సాబ్ సినిమా ఎండ్ కార్డ్‌లో సీక్వెల్‌ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అది సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అన్నట్టుగా కనిపిస్తోంది. అందులో రాజా సాబ్ జోకర్ పాత్రలో కనిపించేలా ఉన్నాడు. అయితే ఈ మూవీ ఉంటుందా? లేదా? అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ గట్టిగా లాభాల్ని తెచ్చి పెడితేనే రెండో పార్ట్ మీద ఆశలు పెట్టుకోవచ్చనిపిస్తోంది. ఈ మూవీ దాదాపు ఐదారు వందల కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప థియేట్రికల్ పరంగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
Also Read – Ram Gopal Varma: సెన్సార్ బోర్డ్ ఓ జోక్ – ఆడియెన్స్‌ను అవమానిస్తోంది – ఆర్‌జీవీ ట్వీట్ వైరల్
రాజా సాబ్ మూవీ టాక్‌తో మారుతి కాస్త డీలా పడినట్టుగా కనిపిస్తోంది. కానీ మేకర్స్ మాత్రం ఆల్రెడీ ఈ మూవీ హిట్ అని, థాంక్యూ మీట్ కూడా పెట్టేసుకుంటున్నారు. మరి ఇది కమర్షియల్‌గా ఏ రేంజ్‌లో లాభాల్ని తెచ్చి పెడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పుడు మాత్రం ఓటీటీ డీల్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
రాజా సాబ్ చిత్రాన్ని జియో హాట్ స్టార్ హక్కుల్ని చేజిక్కించుకుందన్న సంగతి తెలిసిందే. దాదాపు వంద కోట్లకు పైగా ఈ డీల్ జరిగిందట. అయితే ఈ మూవీని హాట్ స్టార్ ఎలా ప్రమోట్ చేసుకుని ఎంత వ్యూయర్ షిప్‌ను సాధిస్తుందో చూడాలి. ఫిబ్రవరిలో ఈ మూవీని ఓటీటీలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారట.
Also Read – TheRajaSaab: ప్రభాస్ రాజాసాబ్ కలెక్షన్స్ – సలార్‌లో సగం కూడా రాలేదుగా!

