మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వలన గానీ, మరే విధమైన వేధింపుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీ టీం లేదా ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులను సంప్రదించవచ్చని కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత
తెలిపారు
కరీంనగర్ భగత్ నగర్ లోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ నందు సోమవారంనాడు షీ టీం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉమెన్ పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ శ్రీలత మాట్లాడుతూ..
కమిషనరేట్ వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా, మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు గురైన వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని ఇన్స్పెక్టర్ శ్రీలత తెలిపారు.