HomeNewsPortal : సమరానికి సాయం.. 'సత్యాగ్రహ' డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ

Portal : సమరానికి సాయం.. ‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Satyagraha digital platform : దేశంలో ప్రజల నిరసన గళాలు ఒంటరి పోరాటాలుగా మిగిలి మసకబారిపోతున్నాయా? అన్యాయాలపై ఎక్కుపెట్టిన అస్త్రాలు సమన్వయం లేక లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయా? ప్రజా సమస్యల పరిష్కారానికి విపక్ష నేత రాహుల్ గాంధీ వినూత్న అడుగు వేశారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ఉద్యమాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ‘సత్యాగ్రహ’ పేరుతో ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.

- Advertisement -

డిజిటల్ మ్యాప్‌పై పోరాట గాథలు: ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు, కార్మికులు, యువత (Gen Z), మహిళలు, గిరిజనులు తమ సమస్యలు, నిరసనల వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదైన ప్రతి పోరాటం దేశ పటంలో డిజిటల్ పిన్‌గా కనిపిస్తుంది. తద్వారా ఒకే సమస్యపై పోరాడుతున్న ఇతర పౌరులు ఒకరికొకరు మద్దతుగా నిలిచే వెసులుబాటు కలుగుతుంది.

సడక్ నుంచి సంసద్ దాకా భరోసా: మహాత్మా గాంధీ బోధనలను స్మరిస్తూ.. “సత్యం బలమైన ఆయుధం, అయితే సత్యం వైపు ఐక్యంగా నిలబడటం అంతకంటే శక్తిమంతం” అని రాహుల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. విపక్ష నేతగా ప్రజల గళాన్ని వీధుల నుంచి పార్లమెంటు వరకు బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. చెల్లాచెదురైన నిరసనలను ఏకం చేసే ఈ వ్యూహం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News