HomeNewsRajamouli: మోస్ట్ కాంప్లెక్స్ మైండ్ ఇన్ 'వారణాసి'

Rajamouli: మోస్ట్ కాంప్లెక్స్ మైండ్ ఇన్ ‘వారణాసి’

Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్ర పోషిస్తున్నారు. 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలావుండగా, శుక్రవారం పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

“వారణాసిలో మోస్ట్ కాంప్లెక్స్ మైండ్.. హ్యాపీ బర్త్ డే కుంభ” అంటూ పోస్ట్ పెట్టారు. షూటింగ్ లో రాజమౌళి – పృథ్వీరాజ్ ఓ సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్న ఫొటోని కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కూడా పృథ్వీరాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News