అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కడసారి చూసేందుకు ఆయన అభిమానులు , డాన్సులర్లు పోటీపడ్డారు. తన గురువు ఆఖరి చూపు చూసి శేఖర్ మాస్టర్ ఎమోషల్ అయ్యారు. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్ కు వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడ విపరీతమైన మద్యం సేవించాడు. దీంతో ఆయనకు రక్త విరోచనాలు అయ్యాయి. రక్త విరోచనాలు ఎక్కువ కావడం తో ఆయన్ను గాంధీ హాస్పటల్ లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆదివారం కన్నుమూశారు.
సోమవారం రాకేష్ మాస్టర్ శిష్యులు శేఖర్, జానీ మాస్టర్లు తమ గురువు కడసారి చూపుకోసం రాకేష్ మాస్టర్ ఇంటికొచ్చారు. ముందుగా శేఖర్ మాస్టర్ తన గురువు పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం నమస్కారం చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక జానీ మాస్టర్ కూడా తన గురువును కడసారి చూసుకుని ఎమోషనల్ అయ్యారు. కాసేపటి క్రితమే రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి. బోరబండ స్మశాన వాటికలో అంత్యక్రియలను ఆయన కుమారుడు చరణ్ నిర్వహించారు.
రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ‘ఆట’, ‘ఢీ’ వంటి డ్యాన్స్ రియాల్టీ షోల ద్వారా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆలా వచ్చిన ఫేమ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ అయ్యారు. 1500లకు పైగా సినిమాలకు పనిచేశారు. అయితే ఆయన శైలినే ఆయన్ను అవకాశాలు లేకుండా చేసిందని అంత అంటుంటారు. సినిమా ఛాన్సులు లేకపోవడం తో గడిచిన రెండుమూడేళ్లుగా యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎవ్వరికీ భయపడకుండా ఆయన చేసే వ్యాఖ్యలకు చాలా మంది అభిమానులున్నారు. ఆలా యూట్యూబ్ తో బాగా ఫేమస్ అయినా రాకేష్..అగ్గిపెట్టె మచ్చ, సునిశిత్ ,స్వాతి నాయుడు తదితరులతో పలు ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాడు.