Thursday, July 4, 2024
HomeNewsReservations: జాబ్స్, విద్యాసంస్థల్లో 76% రిజర్వేషన్స్, అసెంబ్లీలో బిల్, త్వరలో 80 % రిజర్వేషన్స్ కూడా

Reservations: జాబ్స్, విద్యాసంస్థల్లో 76% రిజర్వేషన్స్, అసెంబ్లీలో బిల్, త్వరలో 80 % రిజర్వేషన్స్ కూడా

విద్యా, ఉద్యోగాల్లో 76శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందేనంటూ ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలోనూ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో భూపేష్ భగేల్ నేతృత్వంలోని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ సర్కారు అతి పెద్ద వ్యూహాత్మక అడుగులు వేసినట్టైంది. సదరు బిల్లుని వ్యతిరేకించలేక ఇతర పార్టీలు చిక్కుల్లో పడ్డాయి. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందాక చట్టంగా మారితే ఎస్టీలకు 32శాతం, ఎస్సీలకు 13శాతం, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు 27శాతం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు 4 శాతం రిజర్వేషన్లు కోటా కింద దక్కనున్నాయి. ఈ కోటా బిల్లును పాస్ చేసేందుకు ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైందికూడా. ప్రపోర్షనల్ కోటా కింద 80 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది భూపేష్ భగేల్ సర్కారు అసలు టార్గెట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News