Tuesday, October 22, 2024
Homeచిత్ర ప్రభSandeep Kishan 30th movie: సందీప్ కిషన్ 30వ సినిమా

Sandeep Kishan 30th movie: సందీప్ కిషన్ 30వ సినిమా

సంక్రాంతి బుల్లోడి గెటప్ లో..

సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రాజేష్ దండా ‘మజాకా’ క్రూషియల్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం

- Advertisement -

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనర్ న్యూ షూటింగ్ షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభమైంది.

20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో, సందీప్ కిషన్, ఇతర ముఖ్యమైన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

సంక్రాంతి బుల్లోడు అవతార్‌లో సందీప్‌కిషన్‌ను ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ప్రామిస్ చేసింది. ఈ మూవీలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో సక్సెస్ ఫుల్ అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News