Saturday, July 12, 2025
HomeNewsSchool holiday: రేపు స్కూళ్లకు సెలవు ఉందా.. లేదా?

School holiday: రేపు స్కూళ్లకు సెలవు ఉందా.. లేదా?

School Holiday Updates: రేపు శనివారం (జులై 05)న రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఉందా లేదా అనే అంశంపై సంగ్ధితత నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రేపు మొహర్రం (Muharram) పండుగ నేపథ్యంలో రేపటి సెలవుపై క్లారిటీ వచ్చింది. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం, రెండు రాష్ట్రాల్లోనూ మొహర్రం పండుగ సందర్భంగా శనివారం (జూలై 6) ఆప్షనల్ హాలిడేను ప్రకటించాయి. అయితే రెండు రాష్ట్రాల్లో పాఠశాలల పని విధానాల్లో తేడాలు ఉన్నాయి.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ యధావిధిగా: ఆంధ్రప్రదేశ్‌లో రేపు (శనివారం) అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు యధావిధిగా పనిచేయనున్నాయని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు (DEOs), స్కూళ్లకు సైతం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే 50 శాతం ఉపాధ్యాయులు తప్పనిసరిగా స్కూల్‌కు హాజరు కావాలని ఇందులో పేర్కొన్నారు. వీరు విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. మొహర్రం పండుగను గౌరవిస్తూ శనివారం ఆప్షనల్ సెలవుగా ప్రకటించినా.. స్కూల్స్ నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

తెలంగాణలో అస్పష్టత: తెలంగాణలో మొహర్రం సందర్భంగా శనివారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అయితే స్కూళ్లకు సెలవులపై ఇంకా అధికారిక సమాచారం తల్లిదండ్రులకు లేదా పాఠశాలలకు ఇంకా అందలేదని తెలిసింది. దీంతో చాలా స్కూళ్లు రేపు కూడా యథాప్రకారం కొనసాగుతాయని తల్లిదండ్రులతో పాటు స్కూళ్ల యాజమాన్యాలు సైతం అంచనా వేస్తున్నారు. అయితే విద్యాశాఖ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రాకపోవడంతో, స్కూళ్లు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News