Thursday, April 3, 2025
HomeNewsVenkatrami Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్

Venkatrami Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్

Venkatrami Reddy| ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపాకలూరు గార్డెన్స్‌లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో తోటి ఉద్యోగులు తమకు ఏం తెలియదని..వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తేనే పార్టీకి వచ్చామన్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడు ఫుల్ బాటిళ్లు ఉండటంతో పాటు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా డిసెంబరు 4న సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ ఎన్నికల సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా వెంకట్రామిరెడ్డి వైసీపీ సానుభూతిపరుడిగా పేరు పొందారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులతో సమావేశాలు పెట్టి వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News