Thursday, April 3, 2025
HomeNewsSeethakka in Durgamma temple: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

Seethakka in Durgamma temple: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

అమ్మవారి..

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి సీతక్క దుర్గగుడిలో ఆదివారం ఉదయం
ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క
కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు అధికారులు, వేద పండితులు.

- Advertisement -


అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతక్కను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదం చిత్రపటం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది గంగ శెట్టి అయ్యప్ప తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News