Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Pakistan: పాక్ వక్రబుద్ధి.. వారి రక్షణ కోసం చట్ట సవరణ

Pakistan: పాక్ వక్రబుద్ధి.. వారి రక్షణ కోసం చట్ట సవరణ

Pak passes bill: ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ హైజాకర్లకు, ఉగ్రవాదులకు ఆశ్రయం కలిపించిన వారి కోసం ఏకంగా చట్ట సవరణ చేసింది. వారి మరణ శిక్ష రద్దు చేయటం కోసం పాక్ సెనెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది.

- Advertisement -

Readmore: https://teluguprabha.net/international-news/us-designates-trf-terrorist-group-pahalgam-attack/

పాక్ పీనల్ కోడ్ ప్రకారం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు ఋజువైతే మరణశిక్షపై అర్హులు. జనరల్ జియా ఉల్ హక్ పాలన నుండి ఈ మరణశిక్ష అమలులో ఉంది. మహిళలను బలవంతంగా బహిరంగ ప్రదేశాలలో వివస్త్రను చేసిన ఈ తరహా శిక్షను అమలు చేసారు. అయితే ఈ శిక్షలను రద్దు చేయటానికి ఇపుడు కొత్తగా క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025 ను ప్రవేశ పెట్టింది పాక్ ప్రభుత్వం.

Readmore: https://teluguprabha.net/international-news/trump-diagnosed-chronic-venous-insufficiency/

ఈ బిల్లులో హైజాకార్లకు ఉద్దేశ్యపూర్వకంగా ఆశ్రయం కల్పించటం, మహిళలను వివస్త్ర చేయటం వంటి విషయాలలో శిక్షను తగ్గిస్తూ ప్రతిపాదనలు చేసారు. మరణశిక్ష బదులు యావజ్జీవ కారాగార శిక్ష అమలు చేసే విధంగా ఉన్న ఈ బిల్లును పాక్ సెనెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష వర్గాల మాటలను సైతం పాక్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇప్పటికే ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటున్న పాకిస్థాన్ ఈ బిల్లు చట్టరూపం దాల్చాక మరింత చెలరేగిపోవటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad