రాష్ట్రంలోని స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి కోరారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి, తాజ్ గేట్ వే అధినేత రాజయ్య, మురళీ ఫార్సూనర్ అధినేత ముత్తవరపు మురళీలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిచారు.
పక్క రాష్ట్రాల ఎక్సైజ్ పాలసీ చూడండి
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలు విషయాలను తీసుకువచ్చారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ జీవోలను చూపించి, మన రాష్ట్రంలో ఏడాదికి ఎక్సైజ్ ఫీజు రూ. 68 లక్షలు ఉందని, కావున సవరించాలని కోరారు. అలాగే రన్నింగ్ లో ఉన్న హోటల్స్ కు ఇండస్ట్రీ స్టేటస్ అమలు చేయాలని, విద్యుత్ రేట్లు తగ్గించాలని అలాగే మున్సిపల్ టాక్స్ లు తగ్గించాలని కోరారు. హోటల్స్ అసోసియేషన్ వారి విజ్ఞపనలను విన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. హోటల్స్ యాజమాన్యాలకు ఇబ్బంది లేకుండా ఎక్సైజ్ పాలసీని అమలు చేస్తామని హామి ఇచ్చారు.