Friday, November 22, 2024
HomeNewsహీరో విజయ్ రాజకీయాల ఫై ఫోకస్ చేశాడా..? అందుకే ఇలా మాట్లాడాడా..?

హీరో విజయ్ రాజకీయాల ఫై ఫోకస్ చేశాడా..? అందుకే ఇలా మాట్లాడాడా..?

- Advertisement -

తమిళ్ హీరో విజయ్ కి తమిళనాట ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. విజయ్ ఓ మాట అన్నాడంటే దానికి కట్టుబడి ఉంటారు..అలాంటి విజయ్ రాజకీయాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి కారణం తాజాగా ఆయన చేసిన కామెంట్స్.

తమిళనాడులోని చెన్నైలో విజయ్ అభిమాన సంఘం అయిన మక్కల్‌ ఇయక్కం సంస్థ.. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ఇంటర్, టెన్త్‌ క్లాస్‌ టాపర్లను సన్మానించే కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో.. టాపర్లకు విజయ్ స్వయంగా బహుమతులతో పాటు చెక్కులను కూడా పంపిణీ చేశారు. అయితే.. ఈ క్రమంలో.. విద్యార్థులను ఉద్దేశించి విజయ్ మాట్లాడారు.

ప్రస్తుత రోజుల్లో వ్యవస్థ మొత్తం కమర్షియల్‌గా మారిందన్నారు. ఎన్నికలకు ముందు డబ్బులు పంచిన వాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారని అన్నారు. ఓటర్లకు డబ్బులు ఇచ్చి కొంటున్నాడంటే.. ఆ వ్యక్తి అక్రమంగా ఎంత వెనకేసుకుంటున్నాడో అర్థం చేసుకుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇక నుంచి డబ్బులు తీసుకుని ఓటు వేయవద్దని చెప్పాలని విద్యార్థులకు విజయ్ సూచించారు. విద్యార్థులు మీరు ప్రయత్నించండి.. మీరు చెబితే అది జరుగుతుందని తనకు నమ్మకం ఉందని అన్నారు. రాబోయే కొన్నేళ్లలో ఓటర్లు మీరే ఓటర్లు అని.. భవిష్యత్‌ నాయకులను ఎన్నుకోవాల్సిందే మీరేనంటూ మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దని.. అందులో మంచి విషయాల గురించి మాత్రమే తెలుసుకోవాలన్నారు. డా.బీఆర్ అంబేద్కర్‌, పెరియార్‌, కామరాజ్ వంటి గొప్ప వ్యక్తులు రాసిన పుస్తకాలను చదవాలని సూచించారు.

ఇదే క్రమంలో.. ధనుష్ నటించిన అసురన్‌ సినిమాలోని డైలాగ్‌ను విజయ్ చెప్పాడు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బుంటే లాగేసుకుంటారు.. కానీ చదువును మాత్రం మనదగ్గరి నుంచి ఎవ్వరూ తీసుకొలేరు.. అంటూ సినిమా డైలాగ్ చెప్పి పిల్లలందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఈ ఒక్క డైలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా తనను ప్రేరేపించిందని విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ , వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు విన్న వారంతా విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడతారు కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News