Wednesday, July 16, 2025
HomeNewsTelangana: తెలంగాణ కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటుకు జీవో జారీ చేసిన ప్రభుత్వం

Telangana: తెలంగాణ కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటుకు జీవో జారీ చేసిన ప్రభుత్వం

TG-PCAA: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా మరో కీలక అడుగు వేసింది. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 1974, వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 1981 నిబంధనలకు అనుగుణంగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ (TG-PCAA)ని ఏర్పాటు చేస్తూ GO Ms No. 48, తేదీ 29.05.2025న ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు, కాలుష్య నియంత్రణ ఆదేశాలపై వచ్చే అప్పీళ్లను పరిష్కరించడమే ఈ అథారిటీ ప్రధాన లక్ష్యం.

- Advertisement -

గౌరవనీయులైన జస్టిస్ శ్రీ. సాంబశివ రావు నాయుడు (మాజీ న్యాయమూర్తి, హైకోర్టు) చైర్మన్‌గా, డా. గాదె దయాకర్ (కెమిస్ట్రీ ప్రొఫెసర్, రిటైర్డ్) సభ్యుడిగా ఈ అథారిటీ రెండు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. జూన్ 5, 2025 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ అథారిటీ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఆదేశాలపై అప్పీళ్లను వినడానికి ప్రత్యేక వేదికగా నిలవనుంది.

పర్యావరణ చట్టాల కింద పరిష్కారం కోరుకునే అప్పీలుదారులు నాంపల్లిలోని గగన్‌విహార్ బిల్డింగ్, 1వ అంతస్తులో ఉన్న TG-PCAA కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. విచారణల షెడ్యూల్ కార్యాలయ నోటీసు బోర్డులో తెలియజేయబడుతుంది.

మరింత సమాచారం కోసం tspcaa540@gmail.com లేదా 040-29300779 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఇది పర్యావరణ న్యాయానికి మరింత పారదర్శకతను అందిస్తుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News