Tuesday, July 15, 2025
HomeNewsLaptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..

Laptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..

Best laptops Under 13K: చాలా సరసమైన ధరకు కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే..మీకో గుడ్ న్యూస్. అమెజాన్ ఇండియాలో ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ లపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. అనేక గొప్ప ఫీచర్లతో కొనుగోలుకు ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లు కేవలం రూ. 13 వేల కంటే తక్కువ ధరలో ఉండడం విశేషం. ఈ జాబితాలో జియో ల్యాప్‌టాప్ కూడా ఉంది. ప్రత్యేకత ఏమిటంటే..? ఈ ల్యాప్‌టాప్‌లను క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

JioBook 11 with Lifetime Office/Android 4G Laptop

జియో ఈ ల్యాప్‌టాప్ అమెజాన్ ఇండియాలో రూ. 12990కి అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్‌పై రూ. 649 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై రూ.8300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే..జియోబుక్ అనేది ఆండ్రాయిడ్ 4G ల్యాప్‌టాప్. ఇది మీడియాటెక్ 8788 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 4GB RAM, 64GB eMMC స్టోరేజ్‌తో కూడిన ఈ ల్యాప్‌టాప్ డిస్ప్లే పరిమాణం 11.6 అంగుళాలు.

Also Read: Amazon: ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ ముసుగులో సైబర్ నేరగాళ్ల మోసాలు..తప్పించుకునే టిప్స్ ఇవిగో..

Walker Thin & Light Laptop

ఈ ల్యాప్‌టాప్ అమెజాన్ ఇండియాలో రూ.12490 ధరతో జాబితా చేయబడింది. ఈ ల్యాప్‌టాప్‌పై రూ.624 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ను రూ.9992 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. 4GB RAM , 128GB SSD ఉన్న ఈ ల్యాప్‌టాప్ సెలెరాన్ ప్రాసెసర్ N4020పై పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో Windows 11 హోమ్ OSని చూడవచ్చు. ల్యాప్‌టాప్ పూర్తి HD IPS డిస్ప్లే 14.1 అంగుళాలు.

 

ULTIMUS Pro Intel Celeron Dual Core Laptop

ఈ ల్యాప్‌టాప్ ధర రూ.11,490. దీన్ని రూ.574 వరకు క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై రూ.8300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుకోవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ల్యాప్‌టాప్‌లో 4GB RAMతో 128GB నిల్వను అందించారు. ఈ ల్యాప్‌టాప్ Windows 11 Homeలో పనిచేస్తుంది. దీనిలో ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్‌ను అమర్చారు. 14.1 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్ బరువు 1.2KG.

 

నోట్: ల్యాప్‌టాప్ లపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News