Amla benefits: పుల్లగా, తియ్యగా ఉండే ఉసిరికాయ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆమ్లాలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం ద్వారా శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బయట న్యూట్రియెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తాయి. ఉసిరికాయ జుట్టు నుండి చర్మం, మూత్రపిండాల నుండి కాలేయం వరకు అన్ని రకాల సమస్యలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అయితే, ఉసిరికాయ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జీర్ణ క్రియ
ఆమ్లాను తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్, జీర్ణ ఎంజైమ్ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఆమ్లాత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
రోగనిరోధక శక్తి
ఉసిరి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆమ్లాను క్రమం తప్పకుండా తీసుకుంటే వైరల్, జలుబు, దగ్గు వంటి కాలానుకున్న సమస్యలు దరి చేరవు.
చర్మం, జుట్టుకు ప్రయోజనకరం
చర్మం లేదా జుట్టు సమస్యలతో బాధపడుతుంటే ఆమ్లానో డైట్ లో చేర్చుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వినియోగం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా వెంట్రుకలు తెల్లబడకుండా చేస్తుంది. ఇకపోతే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆమ్లా సహాయపడుతుంది. ఇది మొటిమలను తగ్గించి వృద్ధాప్యాన్ని ఆపుతుంది.
Also read: Health Tips: క్యారట్ సలాడ్ తో మెరిసే చర్మం మీ సొంతం..
మధుమేహం, గుండె ఆరోగ్యం
మధుమేహ రోగులు తమ డైట్లో ఉసిరిని చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను సైతం తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కారణంగానే గుండ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరును సైతం మెరుగుపరుస్తుంది.
కాలేయం, మూత్రపిండాలు
కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా ఆమ్లాను ఆహారంలో చేర్చుకోవాలి. ఆమ్లా కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం ద్వారా కాలేయం విష పదార్థాలను తొలగిస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా నియంత్రణలో ఉంటుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


