Liver Health: జీవనశైలితో పాటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. లివర్ లో కొవ్వు పెరగపోవడం వల్ల కలిగే ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తే సరైన ఆహారపు అలవాట్ల జీవనశైలితో లివర్ ని తిరిగి ఆరోగ్యంగా మార్చవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యాటీ లివర్‌ను తగ్గించే ఆహారాలు
కాఫీ
కాఫీ శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా కాలేయానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాఫీ తాగితే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ లివర్ వాపును తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను నయం చేయడంలో సహాయపడుతుంది. అయితే, కాఫీ ఎక్కువగా తాగకూడదు. రోజు 1-2 కప్పుల కాఫీ తాగితే సరిపోతుంది.
ఆకుకూరలు
ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాధియోన్ కాలేయం దెబ్బతినకుండా నిరోధిస్తుంది.
ఓట్స్
బోర్డ్స్ ఫైబర్ అద్భుతమైన మూలం. వీటిని తీసుకుంటే కాలేయానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ లివర్ లో కొవ్వు పేరుకు పోవడాన్ని నిరోధిస్తుంది. ఓట్స్ క్రమం తప్పకుండా తింటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
వెల్లుల్లి
ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం కొవ్వు కాలేయానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెల్లుల్లి కాలియా ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. ఇవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. అంతేకాకుండా కొవ్వు పేరుకు పోవడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో ఉండే కాటేచిన్స్ లివర్లో కొవ్వు పేరుకు పోకుండా నయం చేస్తాయి. రోజుకు 1-2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది.