Monday, July 1, 2024
HomeNewsThose MLAs membership must be cancelled: ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాల్సిందే

Those MLAs membership must be cancelled: ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాల్సిందే

సీఎం కుర్చీ కాపాడుకునేందుకు రేవంత్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు

కాంగ్రెస్ లో చేరిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి , డాక్టర్ ఎం .సంజయ్ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ కోరిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి. ఆలోచించి చెబుతానన్న స్పీకర్.

- Advertisement -

మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం .సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరినట్టు, ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారని బీఆర్ఎస్ నేతల బృందం చెబుతోంది. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలని, స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామన్నారు. పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించ వద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారన్నారు.

మేము ఏ ఒక్కరిని వదిలిపెట్టమని, ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నామని, రేవంత్ భయంలో ఉన్నాడని అందుకే కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడన్నారు. పదవిని కాపాడుకోవటానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించ లేదా, మా నాయకుణ్ణి మేము రోజు కలుస్తున్నామని, హైకోర్టు తీర్పు తర్వాతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావచ్చని, కమిషన్ విచారణ వద్దనటం లేదు..జస్టిస్ నర్సింహ రెడ్డిని తప్పించాలని కోరుతున్నామన్నారు.

విచారణలో అన్ని తేటతెల్లం అవుతాయి…కెసిఆర్ మల్లె పూవులా బయటకు వస్తారని బీఆర్ఎస్ నేతలు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News