Monday, June 16, 2025
HomeNewsAadhar Free Update: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

Aadhar Free Update: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

UIDAI Update: ఇప్పుడు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక సంవత్సరం పాటు పొడిగించింది. వచ్చే సంవత్సరం (2026) జూన్ 14 వరకు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఛార్జ్ చెల్లించాలి. గతంలో ఈ గడువు 2025 జూన్ 14 వరకు మాత్రమే ఇవ్వబడింది.

- Advertisement -

దీంతో లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సేవను జూన్ 14, 2026 వరకు పొడిగించినట్లు UIDAI సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ ఉచిత సేవ myAadhaar పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్ గడువును UIDAI ఐదోసారి పొడిగించింది. గతంలో దీనిని 6 నెలలు, మూడు నెలలు పొడిగించగా, ఇప్పుడు ఒక సంవత్సరం పాటు పొడిగించారు. 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటివరకు ఒక్కసారి కూడా దాన్ని అప్‌డేట్ చేయని వారి కోసం ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసే అవకాశం UIDAI అందిస్తోంది.

ఉచితంగా అప్‌డేట్ ఇలా…

పేరు
చిరునామా
పుట్టిన తేదీ

ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి UIDAI అధికారిక వెబ్‌సైట్ myAadhaar పోర్టల్ ను సందర్శించడం ద్వారా మీరు మీ వివరాలను మీరే అప్డేట్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News