నెక్ట్స్ జనరేషన్ సెమీ-హై-స్పీడ్ వందే భారత్ ట్రైన్ల సంఖ్యను కొత్త బడ్జెట్ లో పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సుమారు 300-400 కొత్త వందే భారత్ రైళ్లను కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టేలా కసరత్తులు సాగుతున్నాయి. 160-180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు భారతదేశంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రూపురేఖలు సమూలంగా మార్చేస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. నిజానికి వీటి అసలు స్పీడు గంటకు 220 కిలోమీటర్లు. సమీప భవిష్యత్తులో రాజధాని, శతాబ్ది వంటి హై స్పీడ్ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్లే తెచ్చే యోచనలో కేంద్రం ఉంది. వచ్చే ఫిస్కల్ ఇయర్ లో వంద వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వందే భారత్ రైళ్లను ఎగుమతి చేసే పనుల్లో రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో చవకగా హై స్పీడ్ ట్రైన్స్ ను ఉత్పత్తి చేస్తున్న దేశంగా మనదేశానికి మంచి పాపులారిటీ వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఉపయోగిస్తున్న స్టాండర్డ్ గేజ్ ట్రైన్ పోర్ట్ ఫోలియోను అనుసరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వందే భారత్ రైళ్లలో టిల్టింగ్, స్లీపర్ వేరియెంట్లను కూడా అభివృద్ధి చేసి, 2024కల్లా లాంచ్ చేయనున్నారు.