HomeNewsPetroleum : టెహ్రాన్‌కు షాక్‌: 'షాడో ఫ్లీట్‌'పై అమెరికా ఆంక్షల కొరడా

Petroleum : టెహ్రాన్‌కు షాక్‌: ‘షాడో ఫ్లీట్‌’పై అమెరికా ఆంక్షల కొరడా

US sanctions on Iran oil : మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఉద్రిక్తతల వేళ, శత్రుదేశపు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా మరోసారి పావులు కదిపింది. అంతర్జాతీయ వేదికలపై కంటితుడుపు వ్యవహారాలకు స్వస్తి పలికి, ఇరాన్ ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరైన చమురు వ్యాపారాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా భారీ ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరిట గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రహస్య నౌకాదళంపై అమెరికా ఎందుకు పంజా విసిరింది? టెహ్రాన్ చమురు వ్యాపారాన్ని అగ్రరాజ్యం ఏ విధంగా ఊపిరాడకుండా చేయబోతోంది?

- Advertisement -

రహస్య నౌకాదళంపై విరుచుకుపడ్డ ట్రెజరీ : ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ‘గోరుచుట్టుపై రోకటిపోటు’లా అమెరికా ఆర్థిక శాఖ 27 కంపెనీలు, ఆరుగురు వ్యక్తులు, 22 నౌకలపై తాజా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ నిబంధనలకు నీళ్లొదిలి, ఇరాన్ ముడిచమురును దక్షిణాసియా, తూర్పు ఆసియా మార్కెట్లకు అక్రమంగా తరలిస్తున్న ‘షాడో ఫ్లీట్’ (రహస్య నౌకాదళం) నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడమే దీని పరమావధి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, టర్కీ, యూకేలకు చెందిన షిప్పింగ్ సంస్థలను విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) నల్లజాబితాలో చేర్చింది.

ఆదాయ మార్గాలకు గండి: స్కాట్ బెస్సెంట్ : ప్రాంతీయ అశాంతికి టెహ్రాన్ ఉపయోగిస్తున్న నిధులను నిలువరించడమే తమ ధ్యేయమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్‌కు ఎవరు సాయపడినా అమెరికా చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. కొమొరోస్ జెండాతో నడిచే ‘పారితోష్’, పనామాకు చెందిన ‘బిటు’, ‘స్టార్వే’, బహామాస్ నౌక ‘లక్కీ’లు లక్షలాది బ్యారెళ్ల నాఫ్తా, బిటుమెన్‌ను అక్రమంగా తరలించినట్లు తేలింది. అయితే, రహస్య ముఠా నుంచి వైదొలిగిన ‘హకూనా మటాటా’, ‘పినోచియో’ నౌకలపై ఆంక్షలను సడలించారు.

తీవ్ర పరిణామాలు తప్పవు : ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13902 కింద విదేశాంగ శాఖ మరో 10 సంస్థలపై వేటు వేసిందని అధికార ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. ఆంక్షల పరిధిలోకి వచ్చిన వారి ఆస్తులను తక్షణమే స్తంభింపజేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News