Onions: ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద వారికి జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. జుట్టు బలహీనపడటం, రాలడం, చుండ్రు సాధారణ సమస్యలుగా మారాయి. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కారణాలు. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి చాలామంది అనేక చికిత్సలు కూడా తీసుకుంటున్నారు. ఫలితంగా ఈ చికిత్సల వల్ల ఎలాంటి లాభాలు కూడా లేకుండా పోతున్నాయి. అయితే మీకు తెలుసా? మన వంటింట్లో ఉండే ఉల్లిపాయతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చని! అవును నిజం, ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది చుండ్రును సైతం తొలగిస్తుంది. ఇది మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఇప్పుడు జుట్టు ఆరోగ్యం కోసం ఉల్లిపాయను ఏ విధంగా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికోసం ఉల్లిపాయ రసాన్ని తీసి కాటన్ సహాయంతో నేరుగా తలపై అప్లై చేయాలి. తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉండి తేలిక పార్టీ షాంపుతో తలను కడగాలి. ఇలా వారానికి 2- 3 సార్లు చేయడం ద్వారా జుట్టు బలపడుతుంది. ఇది జుట్టు రాలడాని కూడా తగ్గిస్తుంది.
ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె
ఈ గృహ నివారణ కోసం ఉల్లిపాయ రసంలో కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై పూసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇది జుట్టు మూలాలను పోషిస్తుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యను తొలగిస్తుంది.
Also Read: High Blood Pressure: ఉప్పు మాత్రమే కాదు.. ఈ ఆహారాలు కూడా హైబీపీని పెంచేస్తాయి..
ఉల్లిపాయ రసం, మెంతుల పొడి
ఉల్లిపాయ రసం, మెంతులపూడి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండిటిని కలిపి పేస్ట్ లా తయారు చేసి తలకు పట్టించాలి. దాదాపు 40 నిమిషాల తర్వాత తలను నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుంది.
ఉల్లిపాయ రసం, కలబంద జెల్
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద, ఉల్లిపాయ రసం తలపై పోయడం వల్ల తల దురద, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు చుండ్రును సైతం తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని వాడితే జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది
ఉల్లిపాయ రసం, తేనె
ఉల్లిపాయ రసం తేనె జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ఒక టీ స్పూన్ ఉల్లిపాయ రసంలో అర టీ స్పూన్ తేనె కలిపి తలకు అప్లై చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టుకు సహజమైన మెరుపు ఇవ్వడంతో పాటు, నెత్తిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


