VD14 Hollywood Villain: టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే అది విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘VD 14’ గురించే. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విలన్‌గా హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) యాక్ట్ చేస్తున్నాడు అనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద వైబ్ క్రియేట్ చేస్తోంది. ‘ది మమ్మీ’ (The Mummy) సినిమాల్లో మెయిన్ విలన్ అయిన ఈయన, మన రౌడీ బాయ్ కి ఎంత టఫ్ ఫైట్ ఇస్తారో అనే ఎక్స్‌పెక్టేషన్స్ ఆడియన్స్ లో ఉన్న, ఇంకో పక్కా ఎక్కడో కొడుతుంది సీన అనే ఫీలింగ్ కూడా ఉంది.
ఎందుకంటే గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ కోసం ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) ను కూడా రంగంలోకి దింపారు. మైక్ టైసన్ ఎంట్రీ అప్పట్లో సినిమాకు భారీ హైప్ తెచ్చింది. మైక్ టైసన్ ఎంట్రీతో ‘లైగర్’ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇద్దరు గ్లోబల్ ఫిగర్స్ ఫైటింగ్ సీన్స్ చేస్తారని అందరూ ఎక్సైట్ అయ్యారు. కానీ, ఆ సినిమా కథ, స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌లో మైక్ టైసన్ పాత్ర బలంగా పండకపోవడం వల్ల సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అవ్వడం, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్లాన్స్‌కి పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు మళ్లీ ఆర్నాల్డ్ వోస్లూ విషయం అలా ఏమైనా జరిగే అవకాశం ఉందా అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.
నిజానికి, విజయ్ దేవరకొండ కెరీర్ చూస్తే… ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బిగ్ హిట్స్ తర్వాత, తను తీసుకున్న కొన్ని రిస్కులు వర్కవుట్ అవ్వలేదు. ముఖ్యంగా, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుంచి మొదలుపెడితే, పాన్ఇండియా రేంజ్‌లో భారీగా ప్రమోట్ చేసిన ‘లైగర్’ వరకు, బాక్సాఫీస్ దగ్గర తను అనుకున్న సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. రీసెంట్‌గా వచ్చిన ‘కింగ్డమ్’ కూడా అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది. ఇలాంటి సమయంలో, కథ, కాన్సెప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే, ఇప్పుడు ‘VD 14’ కోసం చారిత్రక కథాంశం ఎంచుకోవడం, ఆపై ఆర్నాల్డ్ వోస్లూని కీలక పాత్రలో తీసుకురావడం అనేది, సాలిడ్ కంబ్యాక్ కోసం వేసిన గట్టి ప్లాన్ అనిపిస్తోంది.
ALSO READ: Paanch Minar OTT: రాజ్ తరుణ్ పాంచ్ మినార్.. వారం రోజుల్లోనే ఓటీటీలో!
‘VD 14’ సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (ట్యాక్సీవాలా ఫేమ్) ఈ పీరియాడిక్ డ్రామాను ఏ రేంజ్‌లో తీర్చిదిద్దాడు, ఆర్నాల్డ్ వోస్లూతో యాక్షన్ సీన్స్‌ని ఎలా ప్లాన్ చేశాడు అనేది సినిమా అవుట్‌పుట్‌ని బట్టి ఉంటుంది. ఈసారి, హైప్ కోసం కాకుండా, కంటెంట్ బలం మీద ఎక్కువగా ఫోకస్ పెడితే, సినిమా ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది.
మొత్తానికి, వరుస ఫ్లాప్‌ల తర్వాత విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ గ్లోబల్ రిస్క్ చాలా కీలకం. ‘ది మమ్మీ’ ఫేమ్ విలన్‌ను తన సినిమాలో దింపి, ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు.

