Friday, December 27, 2024
HomeతెలంగాణVemulavada: రాజన్న కోడెలు అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు

Vemulavada: రాజన్న కోడెలు అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు

ఈవో క్లారిటీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని రాజన్న ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డి ఖండించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులకు ప్రీతిపాత్రమైన మొక్కు అయిన కోడె సమర్పణ వలన కోడెల సంఖ్య పెరుగుతుండటంతో జగిత్యాల రోడ్డులోని అద్దె కోడెల నిర్వహణ కోసం ఒక గోశాల, రెండవది తిప్పాపురంలో గోశాల నిర్వహించబడుతుందని తెలుపుతూ, భక్తుల కోడె మొక్కు కొరకు 200 కోడెలు మినహా మిగత భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు ఆరు నెలల క్రితం మేలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్ గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటి మార్గదర్శకాలను రూపొందించి, పక్కాగా రైతులకు మాత్రమే ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం, ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా వుంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున ఇస్తున్న విషయాన్ని ఈఓ కె వినోద్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ మధ్యనే దేవాదాయ శాఖ అనుమతి తో కోడెల సంరక్షణ కోసం గోశాలలో సిసి ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం అభివృద్ధి పనులను ప్రారంభించామని ఈఓ వెల్లడించారు.
దేవస్థానం గోశాలలో కోడెల పంపిణీ దేవాదాయ శాఖ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేస్తారని ఈఓ తెలుపుతూ, ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలోని ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ వుంటుందని, అన్ని పారదర్శకంగానే కోడెల పంపిణీ జరిగిందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News