Sunday, January 5, 2025
HomeNewsVenkatesh: ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోగా వెంకటేష్

Venkatesh: ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోగా వెంకటేష్

100 Mకి దగ్గర్లో..

విక్టరీ వెంకటేష్ సీనియర్ హీరోగా తన కంబ్యాంక్ ను చాలా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకుంటున్నారని ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. తనకు సూట్ అయ్యే స్టోరీ లైన్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సెట్ అయ్యేలా లేడీ యాక్ట్రెస్ ను సెలెక్ట్ చేసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ చేస్తున్న హీరో వెంకీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇదే విషయాన్ని మరోమారు ప్రూవ్ చేస్తూ ఆయన లేటెస్ట్ మూవీ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్ క్రేజ్ చూస్తుంటే వెంకీకి అచ్చొచ్చిన సంక్రాంతి రిలీజ్ బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయమనిపిస్తోంది. వెంకటేష్ కు సంక్రాంతి రిలీజ్ సెంటిమెంట్ చాలా బాగా కలిసి వచ్చింది, ఈ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కు రెడీ అయి, ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతోంది.

- Advertisement -

హిట్ కాంబో రిపీట్ కాబట్టి హిట్ ఖాయం

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడిలది హిట్ కాంబోగా ఇప్పటికే రికార్డ్ సృష్టించింది, దీంతో ఈ కొత్త మూవీ కూడా పండగపూట కాసుల వర్షం కురిపిస్తుందని, బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతుందని ఇండస్ట్రీ లెక్కలేస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో విడుదలైన మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రాక్స్ యూట్యూబ్, అన్ని మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో మోత మొగిస్తున్నాయి.

టాప్ ట్రెండింగ్ నుంచి దిగట్లేదుగా

బ్లాక్‌బస్టర్‌పొంగల్ సాంగ్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్ ని రెట్టింపు చేసింది. మీను సాంగ్ 6వ స్థానంలో ఆడియన్స్ ను అలరిస్తోంది. విడుదలైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో వున్న గోదారిగట్టు సాంగ్10వ స్థానంలో అదరగొడుతోంది. ఈ మూడు పాటలకు 85 మిలియన్ల వ్యూస్ దాటాయి, ఈ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ పాటలకున్న పాపులారిటీని తెలియజేస్తున్నాయి. సాంగ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో ఫ్యాన్స్ డ్యాన్స్ కవర్‌లు, రీల్స్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ఈ మూడు పాటలు 100 మిలియన్ వ్యూస్ కి చేరువయ్యాయి. సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్బమ్ ఈ సీజన్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ గా అదరగొట్టింది.

ఈ మూవీలో వెంకటేష్ ఎక్స్ కాప్ గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News