Thursday, July 4, 2024
HomeNewsవిజయ్ దేవరకొండ కు అలాంటి టైటిల్ ఏంటి..? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

విజయ్ దేవరకొండ కు అలాంటి టైటిల్ ఏంటి..? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

- Advertisement -

విజయ్ దేవరకొండ కు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా విజయ్ నుండి కొత్త సినిమా రిలీజ్ అయినా , కొత్త సినిమా ప్రారంభమైన సోషల్ మీడియా లో వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం విజయ్..మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే తన తదుపరి చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన 13 వ చిత్రాన్ని ప్రారంభించారు. విజయ్ దేవరకొండ తో ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ మూవీ ని తెరకెక్కించిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. సీతారామం ఫేమ్ మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు రెండు పేర్లను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారని సమాచారం. అందులో ఒకటి ‘ఫ్యామిలీ స్టార్’ కాగా.. మరొకటి ‘కుటుంబరావు’ అని తెలుస్తుంది. ఈ రెండింటిలోనే ఒకటి ఫిక్స్ చేస్తారట. అయితే ఈ రెండు టైటిల్స్ బయటకు రావడం తో అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూత్ స్టార్ అయినా విజయ్ కి ఇలాంటి టైటిల్స్ ఏంటి అని మండిపడుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు వేరే టైటిల్ డిసైడ్ చేస్తారా..? లేక అదే టైటిల్స్ లలో ఒకటి ఫిక్స్ చేస్తారా..? అనేది చూడాలి.

దర్శకుడు పరశురామ్ తీసిన చివరి మూడు సినిమాలు చూస్తే… హీరో ఒరిజినల్ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా ఫిక్స్ చేశారు. ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు పేరు మహి అలియాస్ మహేష్. ‘గీత గోవిందం’లో విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండను చూపించారు. ‘శ్రీరస్తు శుభమస్తు’లో అల్లు శిరీష్ పేరు శిరి అలియాస్ శిరీష్. మరి ఇప్పుడు విజయ్ తో చేసే సినిమాకు వస్తే విజయ్ దేవరకొండను కుటుంబ రావుగా చూపిస్తారా అనేది కూడా చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News