Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభWar 2 : ట్విట్టర్ వేదికగా హృతిక్-ఎన్టీఆర్ మాటల సవాళ్లు.. యుద్ధానికి సిద్ధమంటూ!

War 2 : ట్విట్టర్ వేదికగా హృతిక్-ఎన్టీఆర్ మాటల సవాళ్లు.. యుద్ధానికి సిద్ధమంటూ!

War 2 : “వార్ 2” చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త పంథాలో అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకరిపై ఒకరు సరదాగా సవాళ్లుతో విసురుకుంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో వీరిద్దరి ‘బిల్‌బోర్డ్ యుద్ధం’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

ALSO READ : OG: ఇంట్రవెల్ సీన్‌కి పూనకాలు.. రెడీ అవుతోన్న ఓజాస్ గంభీరా!

ఈ వినూత్న ప్రచారంలో భాగంగా, ఎన్టీఆర్ తన “వార్ 2” క్యారెక్టర్ కు సంబంధించిన భారీ బిల్‌బోర్డ్‌ను హృతిక్ రోషన్ ఇంటికి పంపారు. దానిపై “ఘుంగ్రూ టూట్ జాయేంగే పర్ హమ్‌సే యే వార్ జీత్ నహీ పావోగే” అని సవాల్ విసిరారు. దీనికి హృతిక్ దీటుగా స్పందిస్తూ, తన పోస్టర్‌తో ఉన్న బిల్‌బోర్డ్‌ను ఎన్టీఆర్ ఇంటికి పంపి, “‘నాటు నాటు’ ఎంత చేసినా, ఈ యుద్ధంలో గెలిచేది నేనే” అని కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ దీనిపై “నైస్ రిటర్న్ గిఫ్ట్, హృతిక్ సర్” అంటూ సరదాగా స్పందించారు. ఇక ‘ఘుంగ్రూ’ ‘వార్’ చిత్రంలో హిట్ సాంగ్ కాగా, ‘నాటు నాటు’ ఆస్కార్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ లో సాంగ్.

ALSO READ : Allu Arha: నువ్వు తెలుగేనా – మంచి ల‌క్ష్మికి షాకిచ్చిన అల్లు అర్జున్ కూతురు – వైర‌ల్ అవుతున్న వీడియో

ఇక ప్రస్తుతం ఈ స్నేహపూర్వక పోటీ అభిమానులను ఆకట్టుకుంటోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రంతో ఆసక్తి రేపుతోంది. భారీ యాక్షన్ హంగులతో రూపొందిన ‘వార్ 2’ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad