ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి తెలియని వారుండరు. నియంత పాలనకు పెట్టింది పేరు. ఇతర దేశాల నుండి తన దేశానికి మనుషులు కాదు కదా.. పురుగుల్ని కూడా రానీయడు. అంతేకాదు.. తన దేశ ప్రజల బహిరంగ జీవితాల్లోనే కాదు.. వ్యక్తిగత జీవితాలపై కూడా కిమ్ నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. అతడి కనుసన్నల్లోనే బిక్కుబిక్కుమంటూ బతకాలి. కాదని ఎవరైనా నియమాలను ఉల్లంఘించారా ? ఆ రోజు వాళ్లకి అక్కడి భూమిపై నూకలు చెల్లినట్లే.
ఆఖరికి ఆడవాళ్లు ముఖానికి వేసుకునే మేకప్, పెదాలకు పూసుకునే లిప్ స్టిక్ కూడా కిమ్ అభిరుచికి తగ్గట్లే ఉండాలి. ఎక్కువగా మేకప్ వేసుకున్నా ప్రాబ్లమే. పెదాలకు ఎరుపు రంగు లిప్ స్టిక్ అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఎరుపురంగును కిమ్ పెట్టుబడిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తాడట. అందుకే ఆ రంగు ఆయనకు నచ్చదు కాబట్టి.. దేశంలోని ఆడవాళ్లంతా ఆ రంగు లిప్ స్టిక్ ను పెదాలకు పూసుకోకూడదట. కొత్త స్టైల్ బట్టలూ వేసుకోకూడదు. మేకప్ ఎక్కువ అవకూడదు. పెదాలకు లేత రంగుల లిప్ స్టిక్ లే వాడాలి.
ఆ నియంత పెట్టిన రూల్స్ ఎవరైనా పాటించలేదా.. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు తమ వాహనాల్లో వేసుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారుట. మనిషికి పైత్యం ఉండొచ్చు కానీ.. ఎదుటివారు కూడా తనకు నచ్చినట్లే ఉండాలన్నంత పైత్యం ఉండకూడదు. అదీ ఒక దేశమంతా తన ఆచరణలో నడవాలన్నంత కిమ్ పైత్యాన్ని అక్కడి ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. ఆ దేశ ప్రజలకు కిమ్ నియంత పోకడల నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుందో ఆ దేవుడికే ఎరుకవ్వాలిక.