స్త్రీ లేకపోతే జననం లేదు… స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీలోని భావాలు..
స్త్రీ లేకపోతే సృష్టి లేదు… స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు…
స్త్రీ అంటే…
అనురాగాన్ని పెంచేది అమ్మ…
ఆత్మాభిమానం గలది అమ్మ…
ఇష్టమైన పలుకు అమ్మ…
ఈర్ష లేనిది అమ్మ…
ఉన్నతమైనది అమ్మ….
ఊరట నిచ్చేది అమ్మ….
ఋణాను బంధం అమ్మ ….
ఎన్నడూ వినిపోడి బంధం అమ్మ…
ఏ కల్మషం లేనిది అమ్మ…
ఐక్యమత్యాన్ని నేర్పించేది అమ్మ…
ఒక మాట మీద నిల్చుట నేర్పింది అమ్మ…
ఔనత్యాన్ని చాటింది అమ్మ…
అందరినీ ఆదరించేది అమ్మ….
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆమె’కు మనసారా శుభాకాంక్షలు తెలపండి. వీలైతే.. ఓ చక్కని బహుమతితో ఆమెను సంతోషపెట్టండి.
ఆమె’… తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది… భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.
‘‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి.. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!!
‘‘అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు!!
కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనం!!
అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. స్త్రీమూర్తి గొప్పతనమంటే.
అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతుంది మహిళను గౌరవిద్దాం. ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం’’ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..