Sunday, February 23, 2025
HomeNewsYashoda hospital: డెక్కన్ హెమటోలింక్ 2.0ప్రారంభం

Yashoda hospital: డెక్కన్ హెమటోలింక్ 2.0ప్రారంభం

సదస్సు

‘డెక్కన్ హెమటోలింక్ 2.0’ ఇది బ్లడ్ క్యాన్సర్ నిర్దారణ, చికిత్స, పేషెంట్ కేర్ ‌లో వచ్చిన తాజా పురోగతులపై చర్చించడానికి 200 మందికి పైగా జాతీయ, 10 మందికి పైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో-ఆంకాలజీ వైద్య నిపుణులతో బ్లడ్ క్యాన్సర్స్ పై అతిపెద్ద అంతర్జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో నిర్వహించారు. ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా, యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు, సదస్సును ప్రారంభించారు.

- Advertisement -

మానసిక, ఆర్థిక బలం

ఈ సందర్బంగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు, మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ ‌తో పోరాడడం అంటే కేవలం వైద్య చికిత్సకు సంబంధించినది మాత్రమే కాదని, దీనికి మానసిక బలం, ఆర్థిక మద్దతు మరియు సమాజ అవగాహన కూడా అవసరం అన్నారు. భారతదేశంలో బ్లడ్ క్యాన్సర్ల భారం నానాటికి పెరుగుతుందని, GLOBOCAN 2020 నివేదికల ప్రకారం, భారతదేశంలో ఏటా దాదాపు 1.3 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో రక్త క్యాన్సర్లు గణనీయమైన నిష్పత్తిలో ఉంటున్నాయని డాక్టర్. జి. యస్. రావు తెలిపారు. లుకేమియా, లింఫోమా & మైలోమాతో సహా బ్లడ్ క్యాన్సర్‌లు భారతదేశంలో పెరుగుతూనే ఉన్నాయి, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ప్రకారం లుకేమియా, లింఫోమా & మైలోమా ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రాలలో వాటి ప్రాబల్యం కొంచం ఎక్కువనే చెప్తున్నాయి. రోగులకు, వైద్య నిపుణులకు ఒకే విధంగా ముఖ్యమైన సవాళ్లను విసురుతున్నాయి. అయినప్పటికీ, క్యాన్సర్ చికిత్సలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పురోగతులు-ఎముక మజ్జ మార్పిడి నుండి CAR-T సెల్ థెరపీ వంటి అత్యాధునిక ఇమ్యునోథెరపీల వరకు క్యాన్సర్ చికిత్సలో వచ్చిన విప్లవాత్మక మార్పులు క్యాన్సర్ రోగులకు కొత్త ఆశలను అందిస్తున్నాయని, డాక్టర్. జి. యస్. రావు తెలియజేసారు.

సాంప్రదాయ బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ హెమటాలజిస్ట్, డాక్టర్. గణేష్ జైషేత్వర్, మాట్లాడుతూ యశోద హాస్పిటల్స్, గత 12 సంవత్సరాలుగా 500కి పైగా విజయవంతమైన ఎముక మజ్జ మార్పిడి, వేలాది మంది రక్త క్యాన్సర్ రోగులకు చికిత్స అందించి వారికి కొత్త జీవితాన్ని అందించినట్లు సగర్వంగా ప్రకటించారు. సాంప్రదాయ బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇప్పటి వరకు చాలా మంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు పరిమిత చికిత్స ఎంపికలు ఉండేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టార్గెటెడ్ థెరపీలు, CAR-T సెల్ థెరపీ, జన్యు చికిత్స వంటి అత్యాధునిక ప్రపంచ స్థాయి చికిత్స విధనాలు హెమటోలాజిక్ కేర్ స్వరూపాన్నే మార్చివేసాయన్నారు. లుకేమియా, లింఫోమా, మైలోమా, తలసేమియా, ఇమ్యునో డిఫిషియెన్సీ డిజార్డర్స్, జెనెటిక్ వ్యాధులు మరియు అప్లాస్టిక్ అనీమియా కోసం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) ఒక క్లిష్టమైన చికిత్స ఎంపిక అని అన్నారు.

బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో

ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతన, ఆశాజనకమైన చికిత్స CAR-T సెల్ థెరపీ. ఇది క్యాన్సర్ ‌పై దాడి చేయడానికి రోగి, రోగనిరోధక కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకు CAR-T థెరపీ విదేశాలలో మాత్రమే చాలా ఖరీదైన క్యాన్సర్ చికిత్సగా ఉండేదని, ఇప్పుడు భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు దేశీయ CAR-T చికిత్సలను అభివృద్ధి చేసి సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చేసాయన్నారు. యశోద హాస్పిటల్, హైటెక్ సిటీలో అవసరమైన ప్రతి బ్లడ్ క్యాన్సర్ రోగికి ప్రపంచ స్థాయి చికిత్సను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. బ్లడ్ క్యాన్సర్ ఇకపై మరణశిక్ష కాదు అని, ముందస్తు రోగ నిర్ధారణ, ఖచ్చితమైన చికిత్స విధానాలు CAR-T సెల్ థెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి అత్యాధునిక చికిత్సలతో మనుగడ రేట్లు గణనీయంగా పెరుగుతున్నట్లు డాక్టర్. గణేష్ జైషేత్వర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News