HomeNewsTragedy: ఉసురు తీసిన 'సునామీ' స్వింగ్‌.. జాతరలో యువకుడు మృతి

Tragedy: ఉసురు తీసిన ‘సునామీ’ స్వింగ్‌.. జాతరలో యువకుడు మృతి

Bihar Tragedy: బీహార్‌లోని నలందా జిల్లా రాజ్‌గిర్‌లో వైభవంగా జరుగుతున్న మల్మాస్ జాతరలో విషాదం చోటుచేసుకుంది. సునామీ స్వింగ్‌(రాట్నం) నుంచి జారిపడి యువకుడు అమన్‌ కుమార్‌(25) మరణించాడు. భద్రతా లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగనట్లుగా తెలుస్తోంది. 

- Advertisement -

సోమవారం రాత్రి జాతర సమయంలో అమన్‌ కుమార్‌ స్వింగ్‌పై కూర్చున్నాడు. రాట్నం వేగంగా తిరుగుతున్న సమయంలో ఒక్కసారి యువకుడు పై నుంచి కిందపడిపోయాడు. స్వింగ్‌ తిరుగుతుండగా సేఫ్టీ బెల్ట్ సరిగ్గా లాక్ కాకపోవడం లేదా ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎత్తుపై నుంచి కింద పడటంతో అమన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, యంత్రాంగం వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

Also Read: https://teluguprabha.net/national-news/congress-clarity-on-karnataka-cm-change/

కుటుంబ సభ్యులతో కలిసి సరగాగా గడిపేందుకు జాతరకి వచ్చిన అమన్‌ కుమార్‌ మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన సునామీ స్వింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేటర్‌పై చట్టప్రకారం కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు జరుపుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జాతరలోని అన్ని ప్రధాన స్వింగ్‌లు, అమ్యూజ్‌మెంట్ రైడ్‌లకు అనుమతి నిరాకరించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/shamirpet-tahsildar-arrested-by-acb/

నలందా జిల్లాలో ప్రసిద్ధ రాజ్‌గిర్ ప్రాంతంలో ప్రతి యేటా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జాతరకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా లోపాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News