Friday, September 20, 2024
HomeNewsTelusu Kada by Neeraja Kona: సిద్దు జొన్నలగడ్డ-శ్రీనిధి శెట్టిల 'తెలుసు కదా'

Telusu Kada by Neeraja Kona: సిద్దు జొన్నలగడ్డ-శ్రీనిధి శెట్టిల ‘తెలుసు కదా’

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ షూటింగ్ లో జాయిన్ అయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి

- Advertisement -

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో పాటు సాంగ్ ని షూట్ చేశారు.

తాజాగా కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్‌ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్‌ లో చాలా కీలకమైన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.

నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News