Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Roja fire on Pavan Kalyan: అవినీతి బాబు కోసం యుద్ధం చేస్తావా పవన్ కల్యాణ్!?

Roja fire on Pavan Kalyan: అవినీతి బాబు కోసం యుద్ధం చేస్తావా పవన్ కల్యాణ్!?

బాబుతో పవన్ "ప్యాకేజీ మిలాఖత్"

అమావాస్యనాడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. ప్రజలందరూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలే రోజు దగ్గర్లోనే ఉందని సంతోషిస్తున్నారు

- Advertisement -
  • జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే… పవన్ కల్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నారు.. గతంలో చెప్పులు చూపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనని తాను చెప్పుతో కొట్టుకుంటాడా? లేదా ఇవాళ ప్రెస్ మీట్ లో పక్కనున్న వాళ్లని కొడతాడా? లేక జనసైనికుల్ని కొడతాడా?
  • దేశంలోనే.. పార్టీ పెట్టి పక్కవాడి కోసం తాను పనిచేయడమే కాకుండా తన కార్యకర్తలను కూడా జెండా కూలీలుగా ఇతర పార్టీల జెండాను మోయించే ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్
  • జైల్లో ఉన్న ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న దొంగ దగ్గర ప్యాకేజీ తీసుకుని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన
  • బీజేపీతో పొత్తులో ఉన్నానంటూనే.. అదే మోడీ గారిని బూతులు తిట్టిన చంద్రబాబు, బాలకృష్ణతో పొత్తు పెట్టుకుంటున్నా అంటున్నాడు. తన తల్లిని అత్యంత అవమానకర రీతిలో తిట్టించిన లోకేష్ కు మద్దతిస్తానంటాడు.. పవన్ కల్యాణ్ ఏం మెసేజ్ ఇస్తున్నాడో ప్రజలందరూ గమనించాలి
  • నిజంగా పవన్ కల్యాణ్ కు ప్రజల మీద ప్రేమ ఉంటే.. ప్రజల కోసం ఏరోజైనా పోరాటం చేశాడా? కానీ, ఈరోజు గజదొంగ చంద్రబాబు కోసం పోరాటం చేస్తానని అంటున్నాడు
  • రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పబ్లిసిటీ పిచ్చికోసం చంద్రబాబు చంపేసినప్పుడు ఎందుకు పోరాటం చేయలేదు?
  • చంద్రబాబు నాయుడు.. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని బూతులు తిట్టించి, కొట్టి హింసిస్తే.. ఎందుకు ఆనాడు రాలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? మీ అన్న చిరంజీవి గారు సంఘీభావం తెలపడానికి వస్తే, అరెస్ట్ చేస్తే ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు పోరాటం చేయలేదు?
  • కాపుల మీద అక్రమ కేసులు పెట్టి, లాఠీ ఛార్జ్ చేస్తే ఎందుకు రాలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నా.
  • కేవలం ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు కోసం పనిచేస్తాను, చంద్రబాబును సీఎం చేయడానికే బానిసగా బతుకుతానని సిగ్గు లేకుండా మరోసారి పవన్ కల్యాణ్ ప్రకటించాడు
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తులో కుట్ర కోణం కూడా ఉంది.. 48 గంటల ముందు బాలకృష్ణ టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సీటులో కూర్చొని టీడీపీ క్యాడర్ కు నేనున్నాను, పార్టీని ముందుకు నడిపిస్తానని పిలుపిచ్చాడు. ఆ వ్యాఖ్యల్ని జీర్ణం చేసుకోలేని ఎల్లో మీడియా ఎక్కడా వాటిని ప్రచురించలేదు, డిబేట్ కూడా పెట్టలేదు.. అంటే నందమూరి కుటుంబం టీడీపీకి నాయకత్వం వహిస్తాం అనే ఆలోచనను కూడా చంద్రబాబు, ఎల్లో మీడియా సహించదు. ఆ ఆలోచనను మొగ్గలోనే చంపేస్తుంది అనేందుకు నిదర్శనమే ప్రత్యేక ఫ్లైట్ లో, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తీసుకొచ్చి జైల్లో ములాఖత్ లు చేసుకుని మిలాఖత్ లతో బయటకొచ్చి పొత్తు ప్రకటించారంటేనే అర్థం చేసుకోవాలి. ఆనాడు హరికృష్ణ దగ్గర నుంచి, మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి, ఈరోజు బాలకృష్ణ వరకు… నందమూరి కుటుంబంలో ఎవరూ కూడా టీడీపీ వారసత్వం గురించి ఆలోచన చేసిన కూడా చంద్రబాబు, ఎల్లో మీడియా సహించదని అర్థం అవుతుంది.
  • జనసేన నాయకులను, కార్యకర్తలను “అలగాజనం, సంకరజాతి నా కొడుకులు” అన్న బాలకృష్ణను ఒకవైపు.. తన తల్లిని, తనని అనరాని మాటలు అని, డిబేట్లు పెట్టి, కన్నీళ్లు పెట్టించిన లోకేష్ ను మరోపక్కన పెట్టుకుని సిగ్గులేకుండా ప్రెస్ మీట్ లు పెడుతుంటే జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటో పాపం వారికే అర్థం కావట్లేదు. జనసేన కార్యకర్తల మీద అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సింపతీ చూపిస్తున్నారు.
  • జనసేన కార్యకర్తలు కాదు.. జెండాలు మోసే కూలీలు.. ఎప్పుడు పవన్ కల్యాణ్ ఏ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా మోస్తారు.. ఆ కూలీ కూడా పవన్ కల్యాణ్ కే ప్యాకేజీ రూపంలో వెళ్తుంది.. మాకేం రాలేదు.. మేమేందుకు ఈ పార్టీలో ఉండాలని ఏడుస్తుంటే… జగనన్నకి సెల్యూట్ చేయాలనిపిస్తోంది… ఎందుకంటే, ఆయన కోసం కష్టపడి పనిచేసి, ప్రాణాలు పణ్ణంగా పెట్టిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి నాయకురాలు కూడా జగనన్న జెండా, అజెండాను మాత్రమే తలెత్తి గౌరవంగా, గర్వంగా మోసే విధంగా చేశారే తప్ప ఇంకో పార్టీ జెండా మోయించని జగనన్న నాయకత్వానికి, ఆయన శక్తిసామర్థ్యాలకు, ఆయన దమ్ముధైర్యాలకు సెల్యూట్ చేస్తున్నా.
  • నాయకుడంటే.. ప్రజల కోసం పోరాడాలి, నమ్ముకున్న నేతలకు, కార్యకర్తలకు గౌరవం కల్పించాలే కానీ, తన ప్యాకేజీ కోసం, దొంగ కోసం నమ్మిన కార్యకర్తలను రోడ్డుమీదకు తీసుకొచ్చిన పవన్ కల్యాణ్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. అందుకే మేము ఓటు వేయలేదు.. మాకు తెలిసినంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలకు తెలియలేదే పాపం అని జాలి చూపిస్తున్నారు.
  • చంద్రబాబు దొంగతనంలో వాటా ఉన్నవారే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఆ పార్టీలో మిగతా ఎవరూ సపోర్ట్ చేయట్లేదు
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటే ఏంటో పవన్ కల్యాణ్ కు తెలియదు.. చంద్రబాబు ఎక్కడా సంతకాలు పెట్టలేదని మాట్లాడుతున్నాడు. సీఐడీ చీఫ్ క్లియర్ గా 13 చోట్ల చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడో ప్రూఫ్ లతో సహా చూపించారు.. చదువు రాకపోతే సీఐడీ ఆఫీసుకు వెళ్లి భూతద్దం పెట్టుకుని వెతుకి చూసుకో పవన్ కల్యాణ్..
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగింది కానీ, చంద్రబాబుకు సంబంధం లేదంటా.. చంద్రబాబు ఐదేళ్ళు సీఎంగా ఉండి, కేబినెట్ లో జీవో ఇచ్చింది సీమెన్స్ కి.. మరి డిజైన్ టెక్ ఎక్కడ నుంచి వచ్చింది. సీమెన్స్ డబ్బు పెట్టకుండా, సీమెన్స్ కు డబ్బులు ఇవ్వకుండా.. ప్రభుత్వ డబ్బును బలవంతంగా డిజైన్ టెక్ కు ఇప్పించారని అప్పుడున్న సీఎస్ కృష్ణారావు, ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు నోట్ ఫైల్ లో క్లియర్ గా రాసింది పవన్ కల్యాణ్ చూడలేదా..? లేక చదవడం రాదా?
  • ఆ డబ్బును ఎలా డిజైన్ టెక్ కు దోచిపెట్టి, వేరే వేరే అకౌంట్ లోకి పంపించారో తెలియదా.? ఈ స్కాంలో ఈడీ నలుగురు మీద కేసులుపెట్టి, డిజైన్ టెక్ కు సంబంధించిన రూ.34కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలియదా? ఈ డబ్బులు చంద్రబాబు అకౌంట్లలోకి ఎలా వచ్చాయని ఆయనకు ఐటీ నోటీసులు ఇచ్చింది కూడా తెలియదా?
  • కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ నోటీసులు ఇస్తే.. బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోడీ గారితోనో, ఇటు అమిత్ షా గారితోనో మాట్లాడి చంద్రబాబు పవిత్రుడు, తప్పు చేయలేదు, స్కిల్ స్కాం జరిగింది కానీ చంద్రబాబు చేయలేదని విడిపించవచ్చుగా అది, వదిలేసి జగన్ గారు అక్రమ కేసులు పెట్టారు, అక్రమంగా లోపల పెట్టారని సిగ్గులేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు.. దీంతో అసలు జగన్ గారికి ఏం సంబంధం?
  • తప్పు చేసింది చంద్రబాబు, ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు.. నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ.. ఈడీ వారు అరెస్ట్ చేస్తున్నారు.. సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టి సీఐడీ అరెస్ట్ చేయడం జరిగింది.. అంతేకాని కక్ష్యసాధింపు చర్య ఎక్కడుంది.
  • పవన్ కల్యాణ్ కు కూడా ఇందులో ప్యాకేజీ వచ్చిందేమో అందుకే, ఆయన కూడా అరెస్ట్ అవుతాడని భయంతో మాట్లాడుతున్నాడా?
  • చంద్రబాబు.. కేబినెట్ లో ఉన్న మంత్రులను కూడా మోసం చేసి, ఏ విధంగా డబ్బు దోచుకున్నాడో అందరికి తెలుసు కాబట్టే ఆ పార్టీలో ఎవరూ మాట్లాడట్లేదు
  • అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే.. చంద్రబాబు 13 సంతకాలు పెడితే, అచ్చెన్నాయుడు 5 సంతకాలు పెట్టి ఆయన ప్యాకేజీ ఆయన తీసుకున్నాడు కాబట్టి బయటపడడానికి వాగుతున్నాడు.. టీడీపీ పార్టీలో మహామహులు ఎందుకు మాట్లాడట్లేదో పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి.
  • వ్యక్తిగత కోపాలు లేవు, గొడవలు లేవని మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ గతంలో ఆయనే మాట్లాడిన వీడియోలు చూస్తే.. టీడీపీకి సిగ్గు, మానం, లజ్జ ఉందా..? చంద్రబాబు, లోకేష్ అవినీతిలో కూరుకుపోయి, ప్రజల డబ్బు దోచేశారని, లోకేష్ ను, చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చావు.. ఈరోజు ఆధారాలతో దొరికిపోయి అరెస్టు అయ్యి జైలుకు పోతే ఎందుకు గింజుకుంటున్నావు?
  • నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి.. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ వి.. సినీ ఇండస్ట్రీలో నీలాంటివాడు ఒక్కడు ఉన్నందుకు కళాకారులందరం అవమానంగా భావిస్తున్నాం, సిగ్గుచేటు.
  • చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు చిత్తూరు జిల్లా వాసులమందరం అవమానపడుతున్నాం, జిల్లాకే చెడ్డపేరు తీసుకొచ్చాడు. 14ఏళ్లు సీఎంగా ఉన్నందుకు కనీసం జిల్లాకు కాదు కదా కుప్పంకు కూడా ఏం చేయలేదు. రాష్ట్రం మొత్తం దోచేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి, విర్రవీగిన చంద్రబాబు.. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టుగా చేసిన తప్పులకు ఈరోజు అరెస్ట్ అయ్యాడే తప్పా, ఇది అక్రమ కేసు కాదు. దీనికి, జగన్ గారికి ఎలాంటి సంబంధం లేదు..
  • సింగిల్ గా రావడానికి నేను సింహాన్ని కాదు.. మనిషిని, పొత్తులతో వస్తానని అంటున్నాడు.. అంటే రజనీకాంత్ డైలాగ్.. సింహం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులగా వస్తాయని పవన్ కల్యాణ్ ఒప్పుకున్నాడు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News