ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సెషన్స్ అట్టుడకడం ఖాయంగా మారింది. తొలిరోజే ఆక్సిజన్ సిలండర్లను ముక్కుకు పెట్టుకుని బీజేపీ ఎంపీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేజ్రీవాల్ సర్కారు వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇలా నిరసన తెలియజేశారు.
ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలంతా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని గ్యాస్ ఛాంబర్ లో బతకటమే మార్గమని బీజేపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. ఢిల్లీలో అన్ని రకాల కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వైఖరిని నిరసిస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ భారీ నిరసనకు దిగటంతో సభ వాయిదా పడింది.