వచ్చే ఎన్నికల్లో ఆలూరులో కురవ నేతకే టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ ఆలూరు నియోజకవర్గంలోని కురవలు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఆలూరు నియోజకవర్గం అన్ని మండలాల కురువ నాయకులు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్. మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో కురవలు చంద్రబాబుని కలిశారు.
- Advertisement -
తమ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు మోహన్ వెల్లడించారు. ఆలూరు నియోజకవర్గంలో కురువల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. 62,000 ఓటర్లున్న ఆలూరులో కురవ సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గాల వారు మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు వీరు వివరిస్తున్నారు.