పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, బద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజుని గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశయి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ సమావేశానికి ఎస్టీయూ రాష్ట్ర నాయకులు బసవరాజు అధ్యక్షత వహించారు. మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాడే కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు గెలిపించి శాసన మండలికి పంపించాలని కోరారు. ఇలాంటి అభ్యర్థులను శాసనమండలి పంపిస్తే శాసనమండలిలో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, ఆలోచించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్టీయూ, యూటీఎఫ్, సీపీఐ, సిపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.