Friday, November 22, 2024
Homeపాలిటిక్స్AP: క్రాస్‌ ఓటింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు

AP: క్రాస్‌ ఓటింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు

19 మంది సభ్యులున్న టీడీపీకి 23 ఓట్లు ఎలా వచ్చాయి? కచ్ఛితంగా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.   అప్పుడు 23 మందిని కూడా అలానే బాబు లాగేసుకున్నాన్నాడని, చంద్రబాబుకు తెలిసిన రాజకీయం అదేనంటూ మండిపడ్డారు.  ఆ విద్యలో బాబుతో పోటీ పడలేం అని వైసీపీ మళ్లీ చెబుతోందన్నారు సజ్జల.  క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డవారెవరో గుర్తించామని..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని సజ్జల వివరించారు. 

- Advertisement -

ఇది రాజకీయ పార్టీ, ఉద్యోగం కాదు పీకేయడానికి, విప్‌ చెల్లదు, ఉంటే బాగుండేదని సజ్జల కటువుగా సత్యాన్ని వివరించే ప్రయత్నం చేయటం విశేషం.  క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ వాళ్లని తాము గమనించినా అది ఇంటర్నల్‌ విషయమని ఆయన చెబుతూ..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ఖాయమని వెల్లడించారు.

 జగన్‌ గారి చరిత్ర చూస్తే ఆ రోజు 23 మంది వెళ్తున్నప్పుడు కూడా శుభం.. వెళ్లమనే చెప్పారని, ఈ రోజు కూడా అదే అంటామని, ఉన్నవాళ్లకి గౌరవం ఉంటుంది…కుటుంబంలా చూసుకుంటామన్నారు.  వారి వారి ఆశలతో ప్రలోభాలకు గురైతే అది వారిష్టమని, ఇది ప్రజాస్వామ్యమన్నారు. పార్టీలో అసంతృప్తి ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అసంతృప్తి అనేది ఏముంది..? ఇది పొలిటికల్‌ పార్టీ.  ఇష్టమైన వాళ్లు, ఆయన విధానాలు నచ్చిన వారుంటారని తేల్చిచెప్పారు.  కొంత మంది ఏదో ఆశించి ఏదో రావాలి అనుకుని రాలేదని పక్కచూపులు చూస్తుండవచ్చని, తమకు ఇక్కడ స్థానం లేదనుకుని, టీడీపీలో మాదిరిగా దోచుకోవడానికి, దాచుకోవడానికి అవకాశం లేదనుకున్న వారు వెళ్తారని తెగేసి చెప్పారు.  క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డవారిని గుర్తించడం కోసం తాము ఒక మెకానిజం పెట్టుకున్నామని..ఎవరెవరు క్రాస్‌ ఓటింగ్‌ వేశారు అనేది తెలిసిపోయిందన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News