Owaisi Jubilee Hills Decision : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయడం లేదని అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 11న జరిగే ఎన్నికకు ముందు నేడు నవీన్ యాదవ్, పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్‌తో కలిసి ఒవైసీని కలిశారు. ఈ సమావేశంలో ఒవైసీ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.
ALSO READ:Tollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హంగామా!
ఒవైసీ మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ నుంచి వారి పార్టీ నేతలు ఎమ్మెల్యేగా ఉన్నా, నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. 3.98 లక్షల ఓటర్లు ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు. మురికి వాడలు, పౌర సౌకర్యాల లోపాలు ఉన్నాయి” అని విమర్శించారు. మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్) అనారోగ్యంతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. 2023 అసెంబ్లీలో గోపీనాథ్ 37% ఓట్లతో గెలిచాడు. కానీ 2024 లోక్‌సభలో బీఆర్ఎస్ ఓట్లు 15%కి పడిపోయి, బీజేపీకి బదిలీ అయ్యాయని ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మాగంటి సునీత (గోపీనాథ్ భార్య)ను అభ్యర్థిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నవీన్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చింది. నవీన్ 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ఆ పార్టీ అజారుద్దీన్‌కు టిక్కెట్ కేటాయించింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.


