Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Athmagurava Bhavanalu: బీసీ సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నాం-మంత్రులు

Athmagurava Bhavanalu: బీసీ సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నాం-మంత్రులు

తెలంగాణ ఆవిర్భావం నుంచీ కేసీఆర్ సర్కారు బీసీ సంక్షేమ శాఖకు 48,000 కోట్లను కేటాయించి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రులు సగర్వంగా వెల్లడించారు. వేల కోట్ల విలువైన స్థలాల్లో 41 బీసీ కుల సంఘాలకు 87.3 ఎకరాలు, 95.25 కోట్లు వెచ్చించి 29 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ప్రారంభమైందని తెలంగాణ మంత్రుల బృందం వివరించింది.
బీసీ ఆత్మగౌరవ భవనాల సామూహిక శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

- Advertisement -

రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు 95.25 కోట్లు 87.3 ఎకరాలు కేసీఆర్ కేటాయించారని, ఈ ఆత్మగౌరవ భవనాలను సైతం తమ కులం ఖ్యాతి ఇనుమడించేలా కట్టుకోవడానికి ఆయా సంఘాలకే అవకాశం కల్పించారని గుర్తుచేసారు మంత్రి గంగుల.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News