Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Athmakuru: అతనుంటే మేం రాం, వైసీపీలో ముసలం

Athmakuru: అతనుంటే మేం రాం, వైసీపీలో ముసలం

ఆత్మకూరు వైసీపీలో ముసలం మొదలైంది. ఇంకో ఆరు నెలల్లో ఎలక్షన్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో 12 మంది కౌన్సిలర్లు  ఆత్మకూరు పట్టణ పార్టీ అధ్యక్షుని మార్పుపై అల్టిమేటం ఇచ్చారు.  ఆత్మకూరు పార్టీ అధ్యక్షుడిని మార్చకపోతే ఏ సమావేశం నిర్వహించినా తామంతా రాలేమని తెగేసి చెప్పినట్టు సమాచారం.  ఆదివారం ఆత్మకూరు వైసిపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమంపై  నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆత్మకూరు పట్టణానికి చెందిన 12 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడం గమనార్హం.

- Advertisement -

దీనికి కారణం ఆత్మకూరు వైసిపి పార్టీ పట్టణ అధ్యక్షుడి వ్యవహార శైలి నచ్చకపోవటమే అని తెలుస్తోంది. ఆయన ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే  12 మంది కౌన్సిలర్లు  సమావేశానికి రాలేదన్నది బహిరంగ రహస్యంగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  గతంలోనే పట్టణ పార్టీ అధ్యక్షుడు తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఆయన తీరు మారకపోవడం వల్లే  కౌన్సిలర్లు సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మాపై ఆయన పెత్తనం ఏంటని వీరు నిలదీస్తున్నారు.  ప్రతిదానికీ అడ్డం తగులుతూ, అంతా నాదే నేను చెప్పినట్లే అందరూ వినాలనే ధోరణిలలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారని 12 మంది కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

మున్సిపల్ కార్యాలయంలో సైతం తమ పనులు జరగాలంటే నేను చెబితే చేయలే తప్ప లేదంటే లేదు అని మున్సిపల్ అధికారికి హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో12 మంది కౌన్సిలర్లు వైసిపి నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమానికి హాజరు కాలేమని  నాయకత్వానికి తెలిపినట్లు తెలుస్తోంది. తప్పకుండా పార్టీ పట్టణ అధ్యక్షుడిని మార్చాలేని పక్షంలో వైసిపికి చాలామంది దూరమవుతారని, ఎంత తొందరగా పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగితే అంత మంచిదని కొందరు వైసీపీ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ప్రతి విషయంలో ఆయన తలదూర్చడం, కొందరిపై ఉన్నవి లేనివి చెప్పడం, అంతా నాదే జరగాలని, నేను చెప్పినట్లే వినాలని ధోరణిలో పట్టణ అధ్యక్షుడు ఉన్నాడని వైసిపి నాయకులే కొందరు వాపోతున్నారు.  ఆత్మకూరు పట్టణంలో రెండు గ్రూపులుగా నాయకులు ఉన్నారు.  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కౌన్సిలర్స్ గా మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే, ఈయన పెత్తనం ఏంటని 12 మంది కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి  నియోజకవర్గ సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డికి పట్టణ అధ్యక్షుడి వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీంతో శిల్ప భువనేశ్వర్ రెడ్డి పార్టీ పట్టణ అధ్యక్షుడిని తన పద్దతి మార్చుకోవాలని మందలించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News