Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Bandi Parthasarathi Reddy: సొంత నిధులతో అభివృద్ధి చేస్తా

Bandi Parthasarathi Reddy: సొంత నిధులతో అభివృద్ధి చేస్తా

130 దేశాల్లో ఫార్మా వ్యాపారాలు

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు లభించని పక్షంలో సొంత నిధులతో ఆ పనులు పూర్తి చేస్తానని రాజ్యసభ సభ్యులు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి అన్నారు. సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను సామాన్య రైతు కుటుంబాల నుంచి వచ్చానని ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలోనే విద్యను అభ్యసించానన్నారు. ఇవి ప్రజలు కట్టిన పనులతోనే నడిచాయని తాను కూడా వాటి రుణం తీర్చుకోవాలి అనుకుంటునన్నారు. కందుకూరులోని హై స్కూల్ ను ఉన్నతంగా తీర్చిదిద్దానని, ఇంటర్మీడియట్ చదివిన సత్తుపల్లిలోనే బండి శోభనాచలం జూనియర్ కళాశాలను ఆధునrకరిస్తానని, డిగ్రీ చదివిన ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బిజీ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశానన్నారు. తాను ఎంతో కష్టపడి చదివానని, ఎమ్మెస్సీ పీహెచ్డి అనంతరం క్యాన్సర్ విభాగంలో శాస్త్రవేత్తనయ్యానన్నారు. తాను ఉపాధి పొందుతూ పది మందికి ఉపాధి కల్పించాలని సంకల్పంతోనే ఈ స్థాయికి వచ్చానన్నారు. 1980లో కెమిస్ట్ గా 600 జీతంతో ఉద్యోగం చేరి 1994లో కొందరు సహోద్యోగులతో కలిసి హెటిరో డ్రగ్స్ కంపెనీ ప్రారంభించానన్నారు. 30 సంవత్సరాల కాలంలో 40 ఇండస్ట్రీలను ఏర్పాటుచేసి 130 దేశాలలో వ్యాపారం విస్తరించిందన్నారు. నాణ్యమైన మందులను ఉత్పత్తి చేయడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాను అన్నారు. 2003లో అమెరికాలో కంపెనీ ప్రారంభించి 2000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు. చైనా బ్రెజిల్ కెనడా మాస్కో జపాన్ దుబాయ్ రష్యా హేట్రో డ్రగ్స్ ఉత్పత్తి ప్రారంభమైయ్యాయి అన్నారు. ఆ దేశాల చట్టాల ప్రకారం వ్యాపారాలు చేస్తూ పనులు చెల్లిస్తూ మన దేశానికి వేలకోట్ల పనులు చెల్లించానన్నారు. స్నేహితులు శ్రేయోభిలాషులతో కలిసి సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాను అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాల మినీ, ట్యాంక్ బండ్ , కల్లూరులో డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, సమీకృత మార్కెట్, టిటిడి కళ్యాణ మండపం ఆధునికీకరణ పెనుబల్లి మండలంలోని వి ఏం బంజర బస్టాండ్ ఆధునికరణ, సమీకృత మార్కెట్టు, సెంట్రల్ లైటింగ్ సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో బ్లాస్టింగ్ వలన బీటలు వారిని ఇళ్లకు ఆర్థిక సహాయం, బ్లాస్టింగ్ చేసే సమయంలో దుమ్ము లేవకుండా ఆధునిక యంత్రాలు ఉన్నట్లయితే వాటి కొనుగోలుకు ఆర్థిక సహాయం చేస్తానన్నారు. సత్తుపల్లిలో మినీ ఐటి టవర్ నిర్మిస్తానని, ప్రభుత్వం స్థలమిస్తే కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపడతానని ఇప్పటికే నాలుగు కోట్లతో సత్తుపల్లిలో లైబ్రరీ నిర్మించానన్నారు. నియోజకవర్గంలో వెంసురు మండలం బాగా వెనకబడిన ప్రాంతమన్నారు. మర్లపాడు వేంసురు మధ్యలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపడతానని, ఈ రెండు గ్రామాల మధ్య సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చే అవకాశం నాకు ఉంటుందన్నారు సండ్ర వెంకట వీరయ్యకు ఘనవిజయం అందించాలన్నారు.

- Advertisement -

బండి పార్థసారధిరెడ్డి ఔదార్యం.. జర్నలిస్టు సాంబశివరావు వైద్య ఖర్చులు భరిస్తా

బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్తుపల్లి సాక్షి రూరల్ విలేకరి కొవ్వూరు సాంబశివరావు వైద్య ఖర్చులను మొత్తం భరిస్తానని ఎంపీ బండి పార్ధసారధిరెడ్డి స్పష్టం చేశారు. సాంబశివరావు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రెస్ క్లబ్ బండి పార్ధసారధిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News