Friday, April 4, 2025
Homeపాలిటిక్స్Bandi Sanjay: పైలట్ రోహిత్ రెడ్డివి నీచపు రాజకీయాలు

Bandi Sanjay: పైలట్ రోహిత్ రెడ్డివి నీచపు రాజకీయాలు

వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకులు మురళీకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ మత్తులో దాడులు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన, దాడి చేసిన వారిపై శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి యువకులకు డ్రగ్సుమత్తులో రెచ్చగొట్టి కుటుంబంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరు భూకబ్జాలు చేస్తున్నారనే విషయం ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు త్వరలోనే బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెపుతారని పేర్కొన్నారు. తాండూరుకు బయలుదేరిన బండి సంజయ్ కాన్వాయ్ ను చెన్ గోముల్ పోలీసులు అడ్డుకోవడంతో బిజెపి నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News