Tuesday, July 2, 2024
Homeపాలిటిక్స్Bandla fire on KTR: కేటీఆర్ ఓ డిజాస్టర్, కేటీఆర్ సీఎం అంటే 3...

Bandla fire on KTR: కేటీఆర్ ఓ డిజాస్టర్, కేటీఆర్ సీఎం అంటే 3 సీట్లు కూడా వచ్చేవి కాదు

అమెరికాలో ఇల్లు కొనేందుకు వెళ్లిన కేటీఆర్

తండ్రి పేరు అడ్డు పెట్టుకోనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ రాజకీయాల్లో ఓ డిజాస్టర్ అంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. కేసీఅర్ గారి అబ్బాయిగా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపూ లేదన్న బండ్ల గణేష్ కేటీఆర్ చుట్టూ వైఫై లా ఈగో ఉంటుందని సంచలన కామెంట్స్ చేశారు. వందల యు ట్యూబ్ ఛానెల్స్ పెట్టించి మరీ సీఎం రేవంత్ ను తిట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన..బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారంటూ పంచులు వేశారు. రేవంత్ పోరాట యోధుడని, రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నాడన్నారు.

- Advertisement -

కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని, మేం ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ ఇచ్చామన్నారు. మీ హాయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్ కౌంటర్ చేయించే వాళ్ళు, రాళ్లతో కొట్టి చంపించే వాళ్ళని గుర్తుచేసిన బండ్ల.. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్ళారని, కేటీఆర్ హాయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్ల దనం దొరుకుతోందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News