Wednesday, February 12, 2025
Homeపాలిటిక్స్Bethamcharla: కోట్ల సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ బుగ్గన

Bethamcharla: కోట్ల సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ బుగ్గన

టీడీపీకి కొత్త ఉత్సాహం

బేతంచెర్ల మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుగ్గన ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. డోన్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపి ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో ఈ చేరిక సాగింది. బేతంచెర్ల టీడీపీ సీనియర్ నాయకురాలు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బుగ్గన ప్రసన్నలక్ష్మి, టీడీపీ మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య, టీడీపీ సీనియర్ నాయకులు పోలూరు రాఘవ రెడ్డి సమక్షంలో, బుగ్గన ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగ్గన మాధవి రెడ్డి, జాకిరుల్లా బేగ్, రామానాధం జనసేన నాయకులు చల్ల మద్దిలేటి స్వామి, నాగరాజు, శ్రీకంటి మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హెచ్ కొట్టాల గ్రామ టీడీపీ నాయకులు ఉన్నం రఘు కులోత్తమ రావు ఆధ్వర్యంలో కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని కలిసి గజమాలతో సత్కరించారు. ఈ సందర్బంలో రఘు మాట్లాడుతూ, కోట్ల విజయానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News