Wednesday, February 12, 2025
Homeపాలిటిక్స్Bethamcharla: టిడిపి అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తాం

Bethamcharla: టిడిపి అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తాం

జగన్ పాలనపై నిప్పులు చెరిగిన కోట్ల

బేతంచెర్ల మండలంలోని బైనపల్లి, ఎం బాయి గ్రామ పంచాయతీలో బాబు- ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం మండల కన్వీనర్ ఉన్నం ఎల్లా నాగయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో మార్పు రావడం ఖాయమని అన్నారు. కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ కొల్లగొట్టారని ఆరోపించారు. అక్రమ మార్గంలో సంపాదించి దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని కోట్ల మండిపడ్డారు. సంపదను సృష్టించలేక ఉన్న సహజ వనరులను కొల్లగొట్టి, తన బినామీ కంపెనీలకు మళ్లించారని, మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దివాలా తీయించి మరో బీహార్ రాష్ట్రంగా మార్చడం ఖాయమని ఆయన హెచ్చరిస్తూ ప్రసంగించారు.

- Advertisement -


రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని వారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపదను సృష్టించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛమైన పరిపాలన అందిస్తామని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, శశి కుమార్ అప్ప, ప్రసాద్ అప్ప, మాల శివయ్య, వెంకటరాముడు, కృష్ణుడు, మధుసూదన్, ప్రసాద్, మద్దయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News