మేము టిడిపిలోకి చేరలేదని బేతంచర్ల మండల పరిధిలోని కనుమ కింది కొట్టాల గ్రామస్తులు స్పష్టంచేశారు. ఉగాది పండుగ రోజున కనుమక్రింది కొట్టాల వాసులు మాట్లాడుతూ.. మేము టిడిపిలోకి చేరలేదని వివరించారు. వారం రోజుల క్రితం గ్రామంలోకి వచ్చిన టిడిపి నాయకులు తమతో మాట్లాడతామని చెప్పి, మాకు ఇష్టం లేకపోయినా, టిడిపి కండువా వేశారని గ్రామస్తులు తెలిపారు. మా గ్రామానికి 40 సంవత్సరాలకు పైగా సరైన రహదారి లేని తరుణంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, మా గ్రామానికి రహదారి సౌకర్యంతో పాటు, గ్రామ సమీపంలో ఉన్న బిళ్ళ స్వర్గం గుహలను అభివృద్ధి చేశారన్నారు. మా గ్రామ అభివృద్ధికి కృషి చేసిన ఆర్థిక మంత్రి బుగ్గనకే వచ్చే ఎన్నికల్లో మా మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి ,వైఎస్ఆర్సిపి నాయకులు గూని నాగరాజు , గూని చిన్న మహేష్, గోపాల్, మణి వర్ధన్ రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, పాణ్యం రామ్ మోహన్ రెడ్డి, నవీన్ సాయి,సమక్షంలో గ్రామస్తులు జంగిటి సుబ్బయ్య, జంగిటి చిన్న మద్దయ్య, జంగిటి నాగ శేషుడు, బిల్లా శంకరయ్య, జోగి వెంకటయ్య, జంగిటి నాగయ్య, జంగిటి ఎల్లయ్య, చాకలి పెద్ద మల్లయ్య, గోరంట్ల మధు గోపాల్, జంగిటి గోపాల్, జోగి ఎల్లసుబ్బయ్య, మాదన్న, జోగి వెంకటేశ్వర్లు, జోగి చిన్న రాముడు, జోగి సంజీవ, జోగి ఏకాంబరం, జోగి నారాయణ, వల్లూరి సుబ్బారాయుడు, జోగి చిన్న వెంకటేశ్వర్లు, జోగి పెద్ద వెంకటేశ్వర్లు, జంగిటి పవన్ కుమార్, జంగిటి ఈశ్వరయ్య, జంగిటి శివకుమార్, జంగిటి రామాంజనేయులు, వెల్దుర్తి బాల ఉసేని, జంగిటి అనిల్, జంగిటి మద్దిలేటి, జంగిటి రామాంజనేయులు, జోగి ఎల్లా ఆంజనేయులు, బిల్లా రమేష్, జోగి రమేష్, కనుమ కింది కొట్టాల గ్రామస్తులంతా వైఎస్ఆర్సిపి లో చేరారు.