Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Bhatti Vikramarka: బిజెపికి బీ టీంగా బీఆర్ఎస్

Bhatti Vikramarka: బిజెపికి బీ టీంగా బీఆర్ఎస్

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే

తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ఎంపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు మద్దతుగా బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. ప్రభుత్వ రంగ సంస్థల నమ్ముతున్న బిజెపికి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ కు ఓట్లు వేద్దామా? తెలంగాణకు సిరుల బంగారం కురిపిస్తున్న సింగరేణి కాలరీస్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ సంపదలను దోచుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పానంగా అమ్మేస్తున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి ప్రభుత్వ భూములను తన బినామీల పేరిట నమోదు చేస్తున్నారు.రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లాంటి రాష్ట్ర ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం పనికిమాలిన సంస్థలకు లీజికి ఇచ్చి రాబోయే 30 సంవత్సరాల ఆదాయాన్ని దోపిడీ చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత గిరిజనులకు చెందకుండా పక్కదోవ పట్టిస్తున్న బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్లో సగం బడ్జెట్ కేటాయించాల్సిన సీఎం కేసీఆర్ బీసీ బందు పేరిట తూతూ మంత్రంగా నిధులు ఇచ్చి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఇష్టంలేని టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ మూడు లక్షలు రూపాయలు గృహలక్ష్మి పేరిట ఇచ్చారు అవి ఎన్నికల ముందు ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయి.ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న దోపిడిదారులను తరిమికొడతామని చెప్పారు.జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దోపిడి దారులను తరిమికొట్టే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,అందరికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా బూత్ కమిటీ ఇన్చార్జిలు బండారు నరసింహారావు పారుపల్లి విజయకుమార్ బొల్లెద్దు రాజేంద్ర ఆదిమూలం శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు ఎర్రగుంట లక్ష్మి, టీవీ చౌదరి, దేవి శెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు,అద్దంకి రవికుమార్, దుంప వెంకరేశ్వర్రెడ్డి, నిడమనూరి వంశీ కృష్ణ,,సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జహంగీర్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బనవత్ వెంకటరమణ నాయక్ పట్టణాని ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు షేక్ బాజీ డివిజన్ కమిటీ అధ్యక్షులు షేక్ షన్ను,మల్ల ప్రదీప్,మోదుగుబాబు,,కోమకుల రమ, అద్దంకి మంజీర, గౌసుద్దీన్,కోట డేవిడ్, తలుపుల వెంకటేశ్వర్లు, మాగం ప్రసాద్ ,మరియు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News